
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna)అప్ కమింగ్ మూవీ 'కాక్ టెయిల్ 2(Cocktail 2). రష్మిక నుంచి వివాహం తర్వాత వస్తున్న మూవీ కావడం, 2012 లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'కాక్ టెయిల్ కి సిక్వెల్ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. షాహిద్ కపూర్, కృతి సనన్ తో కలిసి రష్మిక సెల్యులాయిడ్ పై అడుగుపెట్టనుంది.
ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామాకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కాక్ టెయిల్ 2 పెద్దలకు మాత్రమే అని 'A ' సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీలో బోల్డ్ కిస్సింగ్ సీన్లు, బెడ్ రూమ్ సన్నివేశాలు డబుల్ మీనింగ్ డైలాగుల కారణంగానే సెన్సార్ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. హోమి అదజానియా దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం మొదటి భాగం క్లీన్ 'U/A' సర్టిఫికేట్ తెచ్చుకోగా సీక్వెల్ మాత్రం 'A' సర్టిఫికెట్ తో థియేటర్లలోకి ల్యాండ్ కాబోతుండటం విశేషం.
ఈ సర్టిఫికేషన్ కారణంగా ఈ చిత్రంలోని ముగ్గురు ప్రధాన నటీనటుల కెరీర్‌లో అత్యంత ఆసక్తికరమైన రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యంగా గ్లామరస్ బ్యూటీ కృతి సనన్ తన 12 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఒక 'A' రేటెడ్ సినిమాలో నటించింది. ఇప్పటివరకు ఫ్యామిలీ ఓరియెంటెడ్ మరియు లవ్ స్టోరీలతో మెప్పించిన కృతికి ఇది సరికొత్త ప్రయోగం కానుంది. మరోవైపు నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ఇది హిందీలో రెండవ అడల్ట్ సర్టిఫికేట్ పొందిన సినిమా. గతంలో రణబీర్ కపూర్ తో చేసిన ఏ సర్టిఫికేటెడ్ మూవీ 'యానిమల్' (2023) చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ విషయానికి వస్తే, ఆయన కెరీర్‌లో ఇది ఐదవ అడల్ట్ రేటెడ్ చిత్రం. గతంలో కామినే (2009), ఉడ్తా పంజాబ్ (2016), కబీర్ సింగ్ (2019) తో పాటు ఇటీవల వచ్చిన 'ఓ రోమియో' (2026) చిత్రాలు 'A' సర్టిఫికేట్ పొందాయి. అయితే షాహిద్ కెరీర్‌లో వరుసగా రెండు సినిమాలు 'A' రేటింగ్‌తో రావడం ఇదే మొదటిసారి.
Also read: తమిళ హీరోల సంచలన నిర్ణయం.. ఎందుకిలా చేస్తున్నారు
అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే జోరందుకోగా, ఈ బోల్డ్ అండ్ ఎమోషనల్ యూత్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.







