Home

»

Latest News

Divyanka Sirohi: గుండెపోటుతో ప్రముఖ నటి మృతి 

Apr 23, 2026 8:46AM

 


-ఎంతో భవిష్యత్తు ఉంది 
-కానీ చిన్న వయసులోనే ఎందుకిలా  
-రెస్ట్ అనేది లేకపోవడం గుండెపోటుకి కారణమా!

ఎందుకో తెలియదు కానీ మరణానికి కాస్తయినా జాలి,దయ లేకుండా పోతుంది. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని రోజులు అనే వర్డ్ పై తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే ఉంది. రీసెంట్ గా ఎంతో భవిష్యత్తుని ఉహించుకొని ముందుకు వెళ్తున్న ప్రముఖ నటి దివ్యంక సిరోహి చనిపోవడం ప్రతి ఒక్కర్ని కలిచి వేస్తుంది. పూర్తి వివరాలు చూద్దాం.

దివ్యంక సిరోహి(Divyanka sirohi)..జీ టీవీ లో ప్రసారమైన  'బానో మెయిన్ తేరి దుల్హన్' అనే షోతో పరిచయమయ్యి అనతికాలంలోనే ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్, రాజ్‌నగర్  తన స్వస్థలం. మంగళవారం రాత్రి దివ్యంక అకస్మాత్తుగా  ఇంట్లో కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు.  అప్పటికే ఆమె గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.  పలు చిత్రాల్లో కూడా నటించిన దివ్యంక నుంచి వచ్చిన  50కి పైగా  మ్యూజిక్ వీడియోలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా మాసూమ్ శర్మ, అమిత్ సైనీ వంటి ప్రముఖ గాయకులతో కలిసి ప్రైవేట్ ఆల్బమ్స్ ఓవర్ నైట్  స్టార్‌ డమ్ ని కట్టబెట్టాయి.  టిక్‌టాక్ వీడియోలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. టిక్ టాక్ బాన్ అయ్యాక ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తన సత్తా చాటుతు 1.3 మిలియన్లకి  పైగా సంపాదించుకుంది. మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి BCA పూర్తి చేసి నటనపై ఉన్న మక్కువతో సాఫ్ట్‌వేర్ రంగం వైపు వెళ్లకుండా గ్లామర్ ప్రపంచాన్ని ఎంచుకున్నారు.

also read: Vijay deverakonda: యాక్షన్ స్టైల్  ని విజయ్ దేవరకొండ మొదలు పెట్టాడా!

దివ్యంక మరణవార్త తెలియగానే అభిమానులు సోషల్ మీడియా వేదికగా దివ్యంక గతంలో చేసిన పోస్టులని షేర్ చేస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. గతేడాది ఆమె పెట్టిన ఒక పోస్ట్‌లో "శివా.. నన్ను నీ దగ్గరకు తీసుకెళ్లు" అనే క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఆకస్మిక మృతి పట్ల హర్యానవీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా పైన మనం చెప్పుకున్నట్టు మరణానికి  ఏ మాత్రం జాలి, దయ, కనికరం లేదు. మరణాన్ని శాశ్వత సమాధి రోజు చేసే రావాలని కోరుకుందాం. దివ్యంక వయసు ముప్పై సంవత్సరాలు. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com