TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

'ఆహా'... మారుతి!

May 22, 2020 3:15PM

దర్శకుడు మారుతికి మంచి కామెడీ టైమింగ్ ఉంది. అంతకు మించి మెగా కాంపౌండ్‌తో క్లోజ్ రిలేషన్ ఉంది. ముఖ్యంగా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ తదితరులకు సన్నిహితుడు అనే ముద్ర అతడిపై ఉంది. మారుతి దర్శకత్వం వహించిన 'కొత్త జంట', 'భలే భలే మగాడివోయ్', 'ప్రతిరోజూ పండగే' చిత్రాలకు అల్లు అరవింద్ సమర్పకులు. ఆయన కోసం మారుతి వెబ్ సిరీస్ తీయడానికి రెడీ అయ్యారని సమాచారం.

'ఆహా' అంటూ అల్లు అరవింద్ డిజిటల్ స్ట్రీమింగ్ తెలుగు యాప్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దానికోసం ఒక వెబ్ సిరీస్ చేయమని మారుతిని అడిగారట. ప్రస్తుత పరిస్థుతుల దృష్ట్యా మారుతి అంగీకరించారట. వెబ్ సిరీస్ తర్వాత ఫీచర్ ఫిల్మ్ చేయాలని అనుకుంటున్నారట. వెబ్ సిరీస్‌ని ఫిల్మ్ యాక్టర్స్‌తో గ్రాండ్ లెవల్‌లో తీయాలని మారుతి, అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట. అన్నీ కుదిరితే త్వరలో షూటింగ్ స్టార్ట్ కావచ్చు.

google-ad-img