'కెజిఎఫ్ 2' రేటు మహా ఘాటు
on May 22, 2020
'కెజిఎఫ్ 2'కి శాటిలైట్, డిజిటల్ రైట్స్ రెండొందల కోట్ల రూపాయలకు అటు ఇటుగా వచ్చాయంటే ప్రస్తుత పరిస్థితులు ఒక విధంగా సహాయపడ్డాయని చెప్పవచ్చు. కరోనా తగ్గిన తర్వాత సైతం థియేటర్లకు ప్రేక్షకులు ఎంత మంది వస్తారనేది ఇది ఎవరు స్పష్టంగా చెప్పలేని పరిస్థితుల్లో... ఓటీటీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో... 'కెజిఎఫ్' తొలి భాగం విజయం సాధించిన కారణంగా... రేటు ఎక్కువైనా వెనకాడకుండా తీసుకున్నారు. సాటిలైట్ డిజిటల్ హక్కుల కు వచ్చిన మొత్తం చూసి థియేట్రికల్ హక్కులకు కూడా భారీ రేటు చెబుతున్నారట నిర్మాతలు.
'కెజిఎఫ్' విడుదలైనప్పుడు తెలుగునాట, ఉత్తరాది ప్రేక్షకులలో సినిమాపై ఏ మాత్రం అంచనాలు లేవు. కంటెంట్ బాగుండడంతో అనూహ్య విజయం సాధించింది. సీక్వెల్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో థియేట్రికల్ రైట్స్ కోసం కోట్ల రూపాయలను నిర్మాతలు ఆశిస్తున్నారట. 'కెజిఎఫ్ 2'కి నిర్మాతలు చెప్పే రేటు ఘాటు ఎక్కిస్తుందని, ప్రస్తుత పరిస్థితుల్లో నలభై యాభై కోట్లు పెట్టి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఫిల్మ్ నగర్ గుసగుస.