Home

»

Latest News

Dhurandhar 2:  ధురంధర్ 2 దెబ్బకి  పాక్‌లో నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు క్రాష్. .బ్యాన్ చేసిన దేశంలోనే నెంబర్ 1 

May 16, 2026 4:46PM

 


దక్కాల్సింది దక్కక మానదు.. దక్కంది ఎన్నటికీ దక్కదు.. మనం ఎవరు ఆపడానికి అనే ఈక్వెషన్ ని మరో మాటు చాటి చెప్పింది ధురంధర్ 2(Dhurandhar 2). అందుకు నిదర్శనంగా మన  దాయాది దేశమైన పాకిస్తాన్‌లో సృష్టించిన క్రేజ్ చూసి సినీ విశ్లేషకులు సైతం నోరెళ్లబెడుతున్నారు. పాకిస్తాన్ వ్యతిరేక కథాంశం మరియు అక్కడి ఉగ్రవాద నెట్‌వర్క్‌ను అణచివేసే భారత గూఢచారి కథతో ఈ సినిమా రూపొందడం వల్ల, పాక్ ప్రభుత్వం ఈ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించకుండా పూర్తిగా నిషేధించింది. అయితే, ఏ దేశంలోనైతే  నిషేధం విధించారో, అదే దేశంలో ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో చరిత్ర సృష్టిస్తుండటం విశేషం. అందుకే దక్కాల్సింది దక్కక మానదు.. దక్కంది ఎన్నటికీ దక్కదు అనే వర్డ్ నిజమైంది. మరి ఆ విశేషాలు చూద్దాం 

ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో "రా అండ్ అన్‌కట్" వెర్షన్‌తో అంతర్జాతీయంగా విడుదలైన ధురంధర్ 2, డిజిటల్ స్క్రీన్‌లపైకి వచ్చిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్‌లో నెంబర్ 1 పొజిషన్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా కోసం పాక్ ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూశారంటే, మే 14 అర్ధరాత్రి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కాగానే లక్షలాది మంది వీక్షకులు ఒకేసారి లాగిన్ అయ్యారు. దీనితో పెరిగిన విపరీతమైన ట్రాఫిక్ వల్ల పాకిస్తాన్‌లో నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు కాసేపు పూర్తిగా స్తంభించిపోయాయని, బఫరింగ్ సమస్యలు వచ్చాయని అక్కడి ప్రముఖ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ మావియా ఉమర్ ఫరూకీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని వీడియో సాక్ష్యాలను పంచుకున్నారు. తన వైఫై కనెక్షన్ అద్భుతంగా ఉన్నప్పటికీ, సినిమా ప్లే కాకుండా లోడింగ్ సింబల్ చూపిస్తోందంటూ ఆయన పెట్టిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.


Also read: Peddi: పెద్ది సెట్ లో చిరంజీవి గంట కూడా ఉండలేదు.. ఫ్యాన్స్ భావోద్వేగం 


 మన దేశంలో జియో హాట్‌స్టార్ ఓటీటీ వేదికగా జూన్ 4న విడుదల కానుండగా, ఆలోపే పాకిస్తాన్‌లో నెట్‌ఫ్లిక్స్ సర్వర్లను క్రాష్ చేసే రేంజ్‌లో ధురంధర్ 2 దుమ్మురేపుతుండటం గమనార్హం. సినిమాకి భాష, సరిహద్దులతో సంబంధం లేదని, కంటెంట్ నే కింగ్ అని, ఆ కంటెంట్ ఉంది కాబట్టే  నిషేధించిన దేశంలో కూడా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టవచ్చని ధురంధర్ 2  మరోసారి నిరూపించింది.
   

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com