Home

»

Latest News

ధనుష్ పొలిటికల్ ఎంట్రీ వెనుక ఎవరున్నారో తెలుసా!: అదిరిపోయే సమాధానం చెప్పిన హీరో!

Nov 7, 2026 1:51PM

మాములు హీరో స్థాయి నుంచి పాన్ ఇండియా కట్ అవుట్ గా మారిన ధనుష్ సినీ జర్నీ జగమెరిగిన సినీ సత్యం. పైగా బడా హీరో ఇమేజ్ కి భిన్నంగా నటన మీద ప్రేమతో డి గ్రేడ్ క్యారెక్టర్స్ చేసిన అగ్ర హీరో టాగ్ లైన్ మాత్రం నీ వెంటే నేనుంటా అని పిచ్చి ప్రేమని చూపిస్తూ తన పక్కనే ఉండిపోయింది. దీన్ని బట్టి అభిమానులు, ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. 

ఈ నెల 20 న ఓం మూవీతో మరో సారి బాక్స్ ఆఫీస్ ని తన వశం చేసుకోవడానికి వస్తున్నాడు. ఓం ఆడియో రిలీజ్ సందర్భంగా ధనుష్ మాట్లాడుతు 'నా గురించి రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. కొందరు నా వెనుక ఉన్నారని, మరికొందరు నాకు  మద్దతు ఇస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. అయితే, నన్ను నడిపించేది దేవుడే. నా వెనుక నా అభిమానులు ఉన్నారు. పక్కన ప్రజలు ఉన్నారు. వాళ్ళు నాతోనే ఉన్నారని ధనుష్ చెప్పుకొచ్చాడు.

దీంతో  తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు ధనుష్ నేరుగా సమాధానం ఇవ్వకపోయినా.. బీజేపీ, మరే ఇతర రాజకీయ శక్తి తనను నడిపిస్తోందన్న ప్రచారాన్ని ఖండించినట్లయింది. ప్రస్తుతం తన దృష్టి సినిమాలపైనే ఉందని, దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తుతో చేయనున్న D56 తన తదుపరి ప్రాజెక్ట్ అని ధనుష్ వెల్లడించారు.

గత కొన్ని రోజుల నుంచి  ధనుష్ రాజకీయ ప్రవేశం గురించిన చర్చలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో 'ధనుష్ నర్పణి మంద్రమ్' గా ఉన్న ఈ వేదికలను ఇప్పుడు 'ధనుష్ నర్పణి ఇయక్కమ్' గా మార్పులు చేసి, రాష్ట్రవ్యాప్తంగా విస్తృత సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో ధనుష్  పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వెలసిన పోస్టర్లలో ధనుష్ ని  కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించడం ఈ చర్చలకు మరింత వేడిని పుట్టించింది.

ఇది కూడా చదవండి: సురేఖవాణి వైరల్ వీడియో: అందులో ఉన్న మ్యాటర్ పై అదిరిపోయే రిప్లై ఇచ్చేసింది!
 

ఇదిలాఉండగా.. ధనుష్ తన అభిమాన సంఘం ‘ధనుష్ నర్పణి ఇయక్కం’ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా త్వరలో నాలుగు ఉచిత ట్యూషన్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వీటిలో మూడు చెన్నైలో, మరొకటి కన్యాకుమారిలో ఏర్పాటు చేయనున్నారు. పూర్తిగా ఏసీ సదుపాయంతో ఉండే ఈ కేంద్రాలను రానున్న రెండేళ్లలో తమిళనాడు అంతటా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

 అయితే, ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో ధనుష్‌ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు, ఆ పేరును ఎన్నికల సంఘం వద్ద కూడా నమోదు చేయించుకున్నారంటూ కూడా ఇంకో ప్రచారం జరుగుతుంది. సినిమా రంగం నుంచి ఇప్పటికే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చవచ్చు: పూజాహెగ్డే వరుడు ఎవరో తెలుసా!
మీకు నచ్చవచ్చు: రెండో భర్తకి విడాకులు ప్రకటించిన సింగర్ 

 

[Dhanush Responds To Bjp Support Rumours, Dhanush ABout His Political entry, Dhanush About Om Movie, Tamil Nadu politics, Dhanush BJP support, Operation D Tamil Nadu, Vijay, Tollywood News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com