
హర్రర్.. హర్రర్ .. ఎక్కడ హర్రర్ సినిమాలు, మమ్మల్ని ప్రేమగా భయపెట్టే హర్రర్ జోనర్ సినిమాలు రావా అని ఆ జోనర్ ప్రేమికులు నిత్యం గొణుక్కుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆలాంటి వాళ్లందరికీ సవాలు విసురుతూ ప్యూర్ హర్రర్ మూవీ వచ్చేసింది. పైగా ఓటిటిలో. ఏంటి ఓటిటిలోనా? ఎక్కడ? ఎప్పుడు? త్వరగా చెప్పేయ్ అంటున్నారా? ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది ఉంది.. మరి పుష్ప లో అల్లు అర్జున్ అన్నట్టుగా దమ్ముంటే పట్టుకోరా షెకావత్ వదిలేస్తా సిండికేట్ అన్నట్టుగా, దమ్ముంటే చూసేయండి అసలైన హర్రర్ అంటే ఏంటో చూస్తారు.
'దహాన్: ది ఈవిల్ వితిన్' (Dahaan: The Evil Within). ఒరిజినల్‌గా ఒడియా భాషలో రూపొందిన ఈ సంచలన చిత్రం, ఈ నెల 16 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' (Aha) లో తెలుగు మరియు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఒంటరిగా చూసే ధైర్యం ఉందా అనే సవాల్ విసిరేలా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతోంది. రొటీన్ దెయ్యం సినిమాలకు పూర్తిగా భిన్నంగా, సరికొత్త డైరెక్ట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం హారర్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
సాధారణంగా కుటుంబంతో కలిసి ఉండాలని, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకునే మన్యత అనే యువతి, కొన్ని అనూహ్య పరిస్థితుల కారణంగా తన అక్క అనిందిత, తమ్ముడు సమరేంద్రలతో కలిసి ఓ పాతకాలపు రాజభవనంలోకి నివాసానికి అడుగుపెడుతుంది. ఆ భవనం పైకి చూడటానికి సాధారణంగా కనిపించినప్పటికీ, దాని గోడల వెనుక తరతరాలుగా దాగివున్న భయానక రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రాంతానికి వెళ్లడానికే స్థానికులు హడలిపోతుంటారు. అయితే, ఆ ఇంట్లో ఉన్న కొన్ని పురాతన వస్తువుల మధ్య ఒక రహస్యమైన డిబ్బుక్ పెట్టె ఉంటుంది. ఆ పెట్టెను ఎందుకు తాళం వేసి ఉంచారో తెలియక, విపరీతమైన కుతూహలంతో మన్యత దాన్ని తెరుస్తుంది. ఆ క్షణమే ఆ కుటుంబం జీవితం పూర్తిగా తలకిందులవుతుంది. ఆ పెట్టె తెరిచిన తక్షణం అందులో నుంచి బయటపడిన ఒక ప్రాచీన దుష్టశక్తి మన్యతను పూర్తిగా ఆవహిస్తుంది. అప్పటివరకు ఎంతో సాధువుగా, అందరితో ఆప్యాయంగా ఉండే మన్యత ప్రవర్తన ఒక్కసారిగా మారిపోతుంది. విచిత్రంగా ప్రవర్తించడం, మనుషులను పీక్కుతినేలా వింత చేష్టలు చేయడం వంటి భయానక, జుగుప్సాకరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి.
ఇది కూడా చదవండి: ఏఆర్ రెహ్మాన్ పై రామభక్తులు, నెటిజెన్స్ ఫైర్!
తన చెల్లెలిలో వస్తున్న ఈ ప్రమాదకరమైన మార్పులను గమనించిన అక్క అనిందిత, తమ్ముడు సమరేంద్ర ఆమెని కాపాడుకోవడానికి పడే ఆవేదన ప్రేక్షకులని కంటతడి పెట్టిస్తుంది. మన్యతను ఆవహించిన ఆ భయంకరమైన శక్తిని ఎదుర్కోవడానికి వారు చివరికి ఫాదర్ థామస్ సహాయాన్ని కోరతారు. ఫాదర్ థామస్ నిర్వహించే ఎక్సార్సిజమ్ అనగా దెయ్యాన్ని వదిలించే ప్రక్రియ సన్నివేశాలు చూస్తున్నప్పుడు ఒళ్లు గగుర్పొడుస్తుంది. దర్శకుడు అనుపమ్ పట్నాయక్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది. ఇందులో వాడిన డార్క్ థీమ్, పకడ్బందీ స్క్రీన్‌ప్లే, జంప్ స్కేర్స్ మరియు సరికొత్త దెయ్యం కాన్సెప్ట్ సినిమా స్థాయిని మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో మన్యత పాత్రలో నటించిన నటి ఔరోశిఖా మిశ్రా నటన సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలిచింది. దెయ్యం పట్టిన యువతిగా ఆమె ఇచ్చిన భయానక హావభావాలు, అభినయం సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు నిజంగానే నిద్రలేకుండా చేస్తాయి. అలాగే అనిందిత పాత్రలో బర్షా పట్నాయక్, సమరేంద్ర పాత్రలో సమ్రాట్ మహాపాత్ర, ఫాదర్ థామస్ పాత్రలో పార్థ సారథి రే తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. బలమైన కుటుంబ భావోద్వేగాలు, అతీంద్రియ శక్తుల రహస్యాలు మరియు భయానక వాతావరణం కలగలిపిన ఈ సినిమా వీకెండ్‌లో చూడదగ్గ అద్భుతమైన థ్రిల్లర్ అనుభూతిని ఇస్తుంది. 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది.
[Dahaan The Evil With in Ott Review, Dahaan The Evil Within, Aha OTT review, horror thriller movies Telugu, Dahaan movie streaming Aha, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]







