Home

»

Latest News

బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: ఆ సిటీలో లాస్ట్ పంచ్!

Oct 15, 2026 11:34AM


గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'దాదా'గా సెల్యులాయిడ్ పై చేసే మెస్మరైజ్ కోసం అభిమానులు, ప్రేక్షకులు డిసెంబర్ 24 కోసం ఎంతో అతృతతో ఎదురుచూస్తున్నారు. చిత్ర యూనిట్ కూడా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మైసూర్ లో యాక్షన్ సన్నివేశాలని పూర్తి చేసిన చిత్ర యూనిట్, ఇప్పుడు సినిమా ఆఖరి మరియు ఫైనల్ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో రంగంలోకి దిగింది.   


హైదరాబాద్‌లో ప్లాన్ చేసిన ఈ ఆఖరి షెడ్యూల్‌తో 'దాదా' సినిమా షూటింగ్ పార్ట్ పూర్తిగా కంప్లీట్ కానుంది. ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే మేకర్స్ ఎలాంటి ఆలస్యం చేయకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగులు పెట్టించనున్నారు. మాస్ సినిమాల వీర లెవెల్ హిట్ కాంబినేషన్‌గా పేరున్న 'వీరసింహారెడ్డి' తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని, తమన్ ఎస్ కాంబ్రియో రిపీట్ అవుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది.


ఇది కూడా చదవండి: ఇండస్ట్రీలో రాజకీయాలు,లెక్కలు ఎక్కువ: కన్నీళ్లు పెట్టుకున్న గరివిడి లక్ష్మి 

 

 

 బాలయ్య సరసన అందాల తార కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, టాలెంటెడ్ యాక్టర్ మంచు మనోజ్ నెవర్ బిఫోర్ లుక్‌లో అత్యంత పవర్‌ఫుల్ విలన్ రోల్‌లో కనిపించబోతున్నారు. వీరితో పాటు బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

 

[Dada Shooting Update, Dada Final Schedule Hyderabad, NBK Dada movie, Balakrishna Dada Hyderabad schedule, Gopichand Malineni, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywood News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com