Home

»

Latest News

ఇండస్ట్రీలో రాజకీయాలు,లెక్కలు ఎక్కువ: కన్నీళ్లు పెట్టుకున్న గరివిడి లక్ష్మి 

Oct 15, 2026 11:14AM


స్క్రీన్ పై ఆనంది పెర్ఫార్మ్ చేస్తుంటే తన అందం లాగానే పెర్ఫార్మ్ కూడా అంతే అందంగా ఉంటుంది. 2012 లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆనంది ఈ నెల 17 న 'గరివిడి లక్ష్మి' తో వరల్డ్ వైడ్ గా సందడి చేయడానికి వస్తుంది. ప్రచార చిత్రాలు, సాంగ్స్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పరుచుకుంది. 


 తాజాగా 'గరివిడి లక్ష్మి' ప్రీ-రిలీజ్ వేడుకలో ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఆమె మాట్లాడుతు 'ఒక్కోసారి సినిమా ఇండస్ట్రీలో ఉండే లెక్కలు, రాజకీయాలు చూస్తుంటే నేను అసలు ఈ రంగానికి సరిపోనేమోనని తీవ్ర ఆవేదన చెందాను. అయితే, ఇండస్ట్రీలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, నన్ను  ఆదరిస్తున్న ప్రేక్షకుల ప్రేమాభిమానాలే తనను ముందుకు నడిపిస్తున్న అసలైన బలం. ఇండస్ట్రీ నన్ను గుర్తించకపోయినా, తెరపై నేను  పోషించే ప్రతి పాత్రని  ప్రేక్షకులు గుర్తుపెట్టుకుని చూపిస్తున్న ఆదరణే నాకు  దక్కిన అతిపెద్ద పురస్కారమని ఆమె పేర్కొన్నారు.

 

 


ఇది కూడా చదవండి: జైలర్ 2 పబ్లిక్ టాక్: రజినీకాంత్ మాస్ రచ్చ: సినిమా ఎలా ఉందంటే!

 అసలు మైక్ అందుకున్న క్షణం నుంచే ఆమె గొంతు పూడిపోయింది, కళ్లలో నీళ్లు తిరగడంతో సభలోని వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆనంది స్వస్థలం తెలంగాణలోని వరంగల్.

 

[Actress Anandhi Emotional Speech, Actress Anandhi, Garividi Lakshmi movie, Tollywood politics, Anandhi emotional speech, Anandhi latest news, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywood News]

 


  . 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com