ENGLISH | TELUGU  

'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాకి A సర్టిఫికెట్.. ఎందుకో తెలుసా?

on Feb 10, 2026

 

మితిమీరిన వయలెన్స్, రొమాన్స్ ఉన్న సినిమాలకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇవ్వడం చూస్తుంటాం. అయితే టైటిల్ వల్ల ఒక సినిమాకి A సర్టిఫికెట్ వచ్చింది. ఆ సినిమా ఏదో కాదు.. 'కపుల్ ఫ్రెండ్లీ'. (Couple Friendly)

 

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన ఈ మూవీ వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న  తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా 'కపుల్ ఫ్రెండ్లీ' ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ధీరజ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

 

ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. "కపుల్ ఫ్రెండ్లీ సినిమా టైటిల్ మార్చమని సెన్సార్ వారు అడిగారు. అయితే ఈ టైటిల్ తోనే సినిమా తెరకెక్కింది, ఈ టైటిల్ తోనే పబ్లిసిటీ చేశాం. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. కాబట్టి ఇప్పుడు టైటిల్ మార్చడం సరికాదని ఇదే టైటిల్ కొనసాగిస్తామని చెప్పాం. దాంతో ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. తమిళంలో మాత్రం ఇదే టైటిల్ తో యూఏ సర్టిఫికేషన్ సెన్సార్ నుంచి దక్కింది. ఈ సినిమాలో పెద్దలు చూసే కంటెంట్ ఉంటుందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. 'కపుల్ ఫ్రెండ్లీ'  ఒక ప్యూర్ లవ్ స్టోరీ. చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనుకోవచ్చు. ఈ మూవీలో హీరో హీరోయిన్స్ కు ఒక మంచి ఫ్యామిలీ నేపథ్యం, కుటుంబ సభ్యులు ఉంటారు. వారి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మా సినిమాను ఇబ్బందిపడకుండా చూడొచ్చు. "అన్నారు.

 

కేవలం టైటిల్ వల్ల 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాకి A సర్టిఫికెట్ రావడంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.