ENGLISH | TELUGU  

రెహ్మాన్ కి తెలుగు సినిమా నుండి భారీ ఆఫర్స్? 

on Feb 11, 2026

 

 

 
-ఏ ఆర్  రెహ్మాన్ కోసం క్యూ కట్టిన బడా ప్రాజెక్ట్స్ .. 
-పెద్ది రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఇండస్ట్రీ 
-ఒక్క పాటతో రీసౌండ్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్


ఏ ఆర్ రెహ్మాన్(Ar Rahman)..నామ్ చోటా సౌండ్ బడా హై.. సదరు సౌండ్ కి మూడు దశాబ్దాల ఘన చరిత్ర ఉంది. భారతీయ సంగీత ప్రపంచంలో రెహ్మాన్ సృష్టించని ట్యూన్ లేదు. సంగీతమే తనని ఆరాధించే స్థాయికి కూడా రెహ్మాన్ ఎదిగాడంటే సదరు రంగంలో రెహ్మాన్ ప్రభావం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. కాకపోతే  కొంత కాలం నుంచి తన రేంజ్ కి తగ్గ ట్యూన్స్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం లేదనే విమర్శలని ఎదుర్కొంటున్నాడు. కానీ పెద్ది(Peddi)లోని చికిరి సాంగ్ ,చరణ్ ఎలివేషన్ కి సంబంధించి ఇచ్చిన బిజిఎం తో విమర్శకులు తమ నోటిని క్లీన్ చేసుకునే పరిస్థితి కల్పించాడు. ముఖ్యంగా చికిరి సాంగ్ వరల్డ్ వైడ్ సంగీత ప్రపంచంలో సునామీని సృష్టిస్తుంది. మిగతా సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ అనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. దీంతో మరిన్ని సినిమాలు రెహ్మాన్ ఖాతాలోకి రాబోతున్నట్టుగా టాక్. ఆ డిటైల్స్ ఏంటో చూద్దాం.

 

మన శంకర వరప్రసాద్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన చిరంజీవి(Chiranjeevi)తన నెక్స్ట్ చిత్రాన్ని బాబీ(Bobby)దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి రెహ్మాన్ ని మేకర్స్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ న్యూస్ కనుక ఖాయమైతే రెహ్మాన్ కెరీర్ కి మరో మెగా టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)విలక్షణ దర్శకుడు మనం ఫేమ్ విక్రమ్ కుమార్(Vikram Kumar)కాంబోలో యువి క్రియేషన్స్ ఒక మూవీని సెట్స్ పైకి తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి కూడా రెహ్మాన్ ని రంగంలోకి దింపాలని బావిస్తునట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలే కాకుండా మరిన్ని బిగ్ ప్రాజెక్ట్స్ రెహ్మాన్ వశం కాబోతున్నాయనేది ఫిలిం సర్కిల్స్ లో తాజా న్యూస్.

 

Also read:  టాక్సిక్ కి కొత్త తలనొప్పి.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాష్ట్ర అటవీ శాఖ 
   
చిరంజీవి,విజయ్ దేవరకొండ చిత్రాలు డిఫరెంట్ సబ్జెట్స్ తో కూడినవి. మరి కథకి తగ్గ ట్యూన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో లెక్కలేనన్ని పిహెచ్ డి లు చేసిన రెహ్మాన్ తన ట్యూన్స్ తో అభిమానులు, మ్యూజిక్ లవర్స్ ని సరికొత్త సంగీత ప్రవాహంలో ముంచడం ఖాయం. సదరు ప్రవాహం సినిమా రేంజ్ ని కూడా హిమాలయ శిఖరాల అంత ఎత్తుకి ఎదిగేలా చేస్తుందని రెహ్మాన్ సినీ హిస్టరీ ప్రూఫ్స్ తో సహా కళ్ళ ముందు కనపడుతుంది. 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.