Home

»

Latest News

తమిళ హీరోల సంచలన నిర్ణయం.. ఎందుకిలా చేస్తున్నారు

Jun 15, 2026 12:21PM

 


చియాన్ విక్రమ్ కి తమిళ చిత్ర పరిశ్రమతో పాటు సౌత్ లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. సినిమాతో పాటు తన క్యారక్టర్ కోసం ఎంత కష్టమైనా పడే ఈ విలక్షణ హీరో  గత కొన్నేళ్లుగా హిట్స్ కి నాకు బద్ద శత్రుత్వం ఉందనే రీతిలో వరుస ప్లాప్స్ ని చాలా కాన్ఫిడెన్స్ గానే అందుకుంటున్నాడు. దీంతో  ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా  మారే పరిస్థితి. దీంతో  మారుతున్న సినీ మార్కెట్ పరిస్థితులకి  అనుగుణంగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు.


తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 63వ చిత్రం 'చియాన్ 63' కోసం తన రెమ్యూనరేషన్‌ని  భారీగా తగ్గించుకున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఒకప్పుడు భారీగా పారితోషికం వసూలు చేసిన విక్రమ్ ఇప్పుడు కేవలం 20 కోట్ల ఫిక్స్‌డ్ పారితోషికానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ మొత్తం కావడం గమనార్హం.

ఈ మార్పుకి ప్రధాన కారణం ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వ్యాపార ఒడిదొడుకులేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో థియేట్రికల్ మార్కెట్‌తో పాటు ఓటీటీ, డిజిటల్, శాటిలైట్ రైట్స్ వ్యాపార సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. విక్రమ్న గత చిత్రాలైన 'తంగలాన్', 'వీర ధీర శూరన్' వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు. పైగా డిజిటల్ రైట్స్‌కి  ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదు. దీనివల్ల నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు విక్రమ్ ఈ ముందడుగు వేశారు. అయితే విక్రమ్ కేవలం తక్కువ పారితోషికానికే పరిమితం కాలేదు. ఆయన సరికొత్తగా ప్రాఫిట్ షేరింగ్ మోడల్ అంటే సినిమా లాభాల్లో ముందస్తుగా అంగీకరించిన నిర్దిష్ట శాతం వాటాని  తీసుకునే పద్ధతిని ఎంచుకున్నారు. దీనివల్ల నిర్మాతలపై బడ్జెట్ భారం తగ్గడమే కాకుండా, సినిమా విజయం సాధిస్తే హీరోకి  కూడా భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.

Also read: upasana: పెళ్లిరోజు సర్ప్రైజ్ ఇచ్చిన ఉపాసన కొణిదెల.. ఆ ఇద్దరి పిక్స్ వైరల్  

ప్రస్తుతం దర్శకుడు ఆనంద్ శంకర్ తో మూవీ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన 'ఫస్ట్ ఫ్లేమ్' అనే టీజర్ గ్లింప్స్ సోషల్ మీడియాలోగా ట్రెండ్ అవుతోంది. పొగమంచు మధ్యలో నుండి విక్రమ్ పవర్‌ఫుల్ మాస్ ఎంట్రీ ఇవ్వడం, దానికి సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడవడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రియా షిబు కథానాయికగా చేస్తుండగా సీనియర్ నటులు ఎం.ఎస్. భాస్కర్, ఊర్వశి కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ స్టార్ హీరో అజిత్ తన రెమ్యూనరేషన్‌ని  170 ,200 కోట్ల నుండి 100 కోట్లకి  తగ్గించుకున్నారనే వార్తలు రాగా, నేడు విక్రమ్ కూడా అదే బాట పట్టడం చూస్తుంటే కోలీవుడ్ స్టార్స్ మారుతున్న సినిమా మార్కెట్‌కు తగినట్లుగా మారాల్సి వస్తుందనే విషయం అర్ధమవుతుంది. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com