
'జయం' మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన భామ సదా. దీంతో అగ్ర హీరోయిన్ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ సడన్ గా డల్ అయ్యింది. ఇందుకు కారణాలు అనేవి అనేకం. ప్రెజెంట్ టీవీ షోస్ తో అభిమానులని అలరిస్తూ వస్తుంది.
రీసెంట్ గా సదా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'సినీ పరిశ్రమలో గాడ్‌ఫాదర్ తో పాటు సరైన గైడెన్స్ ఇచ్చే వ్యక్తులు లేకపోవడం వల్ల కెరీర్‌లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా ప్రమేయం లేకుండానే కొన్ని మంచి ప్రాజెక్టులు చేజారిపోయాయి , తమిళంలో ‘టార్చ్ లైట్’ మూవీలో చెయ్యడం నేను చేసిన పెద్ద తప్పు..నేను చాలా సిగ్గుపడే స్వభావం ఉన్నదాన్ని, కానీ ఒక మహిళ జీవిత కథ ఆధారంగా వచ్చిన సబ్జెక్ట్ కావడంతో ధైర్యం చేసి ఆ బోల్డ్ పాత్రలో నటించాను. కానీ ప్రేక్షకులు దానిని కథగా చూడకుండా ‘సదా ఇలాంటి పాత్ర ఎందుకు చేసింది?’ అని ప్రశ్నించడం నన్ను తీవ్రంగా షాక్‌కు గురిచేసింది. ఒక నటిగా సమాజంలో మార్పు తెచ్చే మంచి కథను చెప్పాలనే ఉద్దేశంతోనే చేశాను. కానీ ఆ క్యారక్టర్ ఎందుకు ఎంచుకున్నానా అని ఇప్పటికీ బాధపడుతుంటానని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: 'ది ప్యారడైజ్’చూడాలన్న నానికి సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే రిప్లై

'టార్చ్ లైట్' లో భర్తని ప్రాణాల నుంచి కాపాడుకోవడానికి శరీరాన్ని అమ్ముకునే 'వేశ్య' గా సదా జీవించిందని చెప్పవచ్చు. 2018 లో మూవీ వచ్చింది. యూ ట్యూబ్ లో 'టార్చ్ లైట్' లోని సీన్స్ రికార్డు వ్యూస్ తో ఉండటం గమనార్హం.
[Sada, Sadaa Career Mistake Interview, Sadaa Torchlight Movie Regret, Sadaa Career Setbacks, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






