Home

»

Latest News

Chiranjeevi: అవార్డుకు ఎన్నో దారులు.. అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తూ చిరంజీవి కామెంట్ చేశారా?

Jun 24, 2026 2:53PM

ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా నడుస్తోంది. ఒకప్పటిలా కాదు, సెలబ్రిటీలు ఏ చిన్న మాట మాట్లాడినా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరూ చాలా ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే నెటిజన్ల నుంచి వచ్చే విమర్శలు, విపరీతమైన ట్రోలింగ్ లాంటివి తట్టుకోవడం ఎవరికైనా చాలా కష్టంగా మారుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోందంటే, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో మరియు సోషల్ మీడియా వేదికలపై ఒక పెద్ద చర్చకు, వివాదానికి కారణమవుతున్నాయి. ఆయన అన్న మాటలు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన తాజా చిత్రం 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే 'పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్' పేరిట మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి వేదికపై మాట్లాడుతూ సినిమా విజయంపై, ముఖ్యంగా రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ నటనను చూసి ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారని, ఈ సినిమాతో చరణ్ ఒక పరిపూర్ణమైన నటుడిగా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని చిరంజీవి కొనియాడారు. చరణ్ కనబరిచిన నటన కేవలం అద్భుతం మాత్రమే కాదు, అది ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారని చిరు ఈ సందర్భంగా గుర్తుచేశారు.

అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా, ఆ తర్వాత చిరంజీవి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు అసలు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. వేదికపై చిరంజీవి మాట్లాడుతూ, "అందరూ చరణ్ కి నేషనల్ అవార్డ్ వస్తుందని అంటున్నారు. ఒకవేళ ఆ జాతీయ అవార్డ్ రాకపోయినా పర్లేదు. ఎందుకంటే అవార్డ్ రావడానికి ఎన్నో దారులు ఉంటాయి. కానీ అవార్డుల కంటే ప్రజలందరూ చరణ్ నటనను చూసి ఇది నేషనల్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని మెచ్చుకుంటూ ఉంటే, ఒక తండ్రిగా నాకు చాలా ఆనందంగా అనిపించింది" అని వ్యాఖ్యానించారు. ఇందులో చిరంజీవి వాడిన "అవార్డ్ రావడానికి ఎన్నో దారులు ఉంటాయి" అనే ఒక్క ముక్క ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర కాంట్రవర్సీకి దారితీసింది.

ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గతంలో 'పుష్ప' సినిమాకు గానూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఉత్తమ నటుడిగా ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి బన్నీని మనసులో పెట్టుకునే, అతడిని ఉద్దేశించే ఈ విధమైన కామెంట్లు చేశారంటూ కొందరు నెటిజన్లు మెగాస్టార్‌పై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. 

అయితే మెగాస్టార్ అభిమానులు, విశ్లేషకులు మాత్రం ఈ విమర్శలను పూర్తిగా ఖండిస్తున్నారు. చిరంజీవి ఉద్దేశం అది కాదని, సాధారణంగా ఆర్ట్ ఫిల్మ్స్, కమర్షియల్ హంగులు లేని ప్రయోగాత్మక చిత్రాలు చేస్తేనే అవార్డులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే కోణంలోనే ఆయన మాట్లాడారని చెబుతున్నారు. అంతే తప్ప అవార్డులను కొనుక్కుంటారనో, లేదా లాబీయింగ్ చేస్తేనే వస్తాయనో అనే తప్పుడు ఉద్దేశం చిరుకు లేదని వారు సమర్థిస్తున్నారు. మరి చిరంజీవి ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో కానీ, ప్రస్తుతానికి మాత్రం ఈ స్పీచ్ పెద్ద డిబేట్ లా మారిపోయింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com