Home

»

Latest News

కెమిస్ట్రీ: నభా నటేష్‌తో ధృవ సర్జా రొమాన్స్.!

Oct 6, 2026 2:34PM

కన్నడ స్టార్ ధృవ సర్జా తన తదుపరి సినిమాలో సరికొత్త అవతార్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు యాక్షన్ ఇమేజ్‌తో ఎక్కువగా కనిపించిన ధృవ.. ఈసారి మాత్రం ప్రేమకథతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు ‘కెమిస్ట్రీ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విశాల్ అత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధృవ సర్జాకు జోడీగా నభా నటేష్ నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఓ స్పెషల్ వీడియో ద్వారా టైటిల్‌ను అనౌన్స్ చేశారు.

‘కొంచెం చార్మ్.. కొంచెం మ్యాజిక్.. చాలా చాలా కెమిస్ట్రీ’ అంటూ ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. టైటిల్‌కు తగ్గట్టుగానే విడుదల చేసిన పోస్టర్స్ కూడా సినిమాపై ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వర్షంలో, రెయిన్‌బో గొడుగు కింద ధృవ సర్జా, నభా నటేష్ కనిపిస్తున్న తీరు చూస్తుంటే.. ఇది మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఉండబోతుందనే ఫీలింగ్ వస్తోంది.

ముఖ్యంగా ధృవ సర్జాను ఇప్పటివరకు మాస్ యాక్షన్ సినిమాల్లో ఎక్కువగా చూసిన ఆడియన్స్‌కు ఈ లవర్ బాయ్ లుక్ కొత్తగా అనిపిస్తోంది. యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న ధృవ.. ఇప్పుడు రొమాంటిక్ కథలో ఎలా కనిపిస్తారనే ఆసక్తి మొదలైంది.

ఇక నభా నటేష్‌కు కూడా ఈ సినిమా మంచి ఛాన్స్‌గా మారే అవకాశం ఉంది. కన్నడ సినిమాలతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆమె.. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ధృవ సర్జాతో కలిసి ‘కెమిస్ట్రీ’లో కనిపించనున్నారు.

ఇది కూడా చదవండి: ‘ఊసరవెల్లి’కి 15 ఏళ్లు.. నెగెటివ్ టాక్‌తో ఆల్ టైం రికార్డ్.. ఎన్టీఆర్ బాక్సాఫీస్ పవర్.!

 

 

 

[Chemistry Announcement Video, Chemistry Movie, Dhruva Sarja, Nabha Natesh, Vishal Atreya, TG Vishwa Prasad, People Media Factory, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com