Home

»

Latest News

కరికాల: క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులో హీరోయిన్‌గా కేథరిన్.!

Oct 10, 2026 11:50AM

‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు కలిసి మళ్లీ ఓ విజువల్ వండర్‌ను క్రియేట్ చేయబోతోన్నారు. సందీప్ కిషన్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘కరికాల’. ఈ మూవీని రెండు చాప్టర్‌లుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి చాప్టర్‌ 2027 జూలై 2న, రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న విడుదల కాబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్‌లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. సోషియో ఫాంటసీ, విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సందీప్ కిషన్‌కి జోడిగా కేథరిన్ థ్రెసా నటించనున్నారు. ఈ మేరకు హీరోయిన్‌కి వెల్కమ్ చెప్తూ చిత్రయూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. 

సందీప్ కిషన్, కేథరిన్ తెరపై మొదటి సారిగా కలిసి కనిపించబోతోన్నారు. ఇక ఈ చిత్రంలో కేథరిన్ ఓ డిఫరెంట్ రోల్‌ను పోషించబోతోన్నట్టుగా తెలుస్తోంది. వెల్కమ్ ఆన్ బోర్డ్ అంటూ ‘కరికాల’ టీం రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది.

వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, అత్యద్భుతమైన కథనంతో 'కరికాల' పాన్ ఇండియన్ సినిమాగా రాబోతోంది. భారతీయ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సోషియో-ఫాంటసీ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా ‘కరికాల’ టీం పని చేస్తోంది.

ఇది కూడా చదవండి: కన్నడ స్టార్ దర్శన్‌కు మరో షాక్.. భార్య పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు!

 

 

 

[Catherine Tresa In Karikaala, Catherine Tresa Karikaala Movie, Catherine Tresa Alexander, Karikaala Movie, Sundeep Kishan, Ugandhar Muni, Shambhala Movie, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com