
- శ్రీ సత్య మాటలు వైరల్
-ఇంతకీ ఆమె ఆవేదన ఏంటి!
-షేక్ అవుతున్న సోషల్ మీడియా
ఊహల పల్లకిలో ఉరేగించనా... ఆశల వెల్లువై రాగం పలికించనా.. అనే సాంగ్ లో ఎంత స్వచ్ఛత, మాధుర్యం ఉందో సినిమా కూడా అంతే స్వచ్ఛమైనది, మాధుర్యమైనది. ఆ విషయంలో ఎలాంటి డౌట్స్ ని మైండ్ లోకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అందుకే చాలా మంది నటులు, నటీమణులు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాళ్ళల్లో శ్రీ సత్య(Sri satya)కూడా ఒకటి. బిగ్ బాస్ 6 తో పాటు పలు సీరియల్స్ తన ఖాతాలో ఉన్నాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో ఆమె మాట్లాడిన సినీ, వ్యక్తిగత మాటలు వైరల్ న్యూస్ కి కూడా ఒక టైం అనేది వస్తుందని నిరూపిస్తున్నాయి. మరి ఆ వైరల్ మాటలేంటో చూద్దాం.
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది నిజం. అందుకే నేనే ఉదాహరణ. నాకు టాలెంట్ ఉన్నా అవకాశాలు రావడం లేదు. పరిశ్రమలో నాకు ఎవరూ తెలియదు. ఫోటో షూట్లు చేసి, ఆ తర్వాత వేషం లేదని చెప్పేస్తారు. ఒకసారి నేను మేకప్ వేసుకుంటుంటే, నా బ్యాగుని రూమ్ బయట పడేశారు. ఎవరితో పడితే వాళ్లతో రూమ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినందుకు నన్ను ఘోరంగా అవమానించారు. ఆస్తి, అంతస్తుల కోసమే నా లవర్ నాకు బ్రేకప్ చెప్పాడు. ఆ బాధని తట్టుకోలేక ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాను. దాంతో మా అమ్మ తట్టుకోలేకపోయింది. ఫలితంగా మాట పడిపోయింది. ఏడాది పాటు ట్రీట్ మెంట్ చేయించినా ఫలితం లేదు.
also read: స్టార్ హీరోలు ఉన్నా విలన్ వల్ల బ్లాక్ బస్టర్ అయిన మూవీస్.. మళ్ళీ ఆ విలన్ వస్తాడా!
బతికి ఉన్నంత కాలం అమ్మ అలానే ఉండాలి" నా మూతి కొంచెం ముందుకు ఉండాలని లిప్ సర్జరీ చేయించుకున్నాను. డాక్టర్ వద్దు అని చెప్పినా వినకుండా చేయించుకున్నా. కానీ అది నా ముఖానికి సెట్ కాలేదు. పెళ్లికి ముందు సహజీవనం చేయడం నాకు ఇష్టం లేదు. పెళ్లి అనే బంధానికి చాలా గౌరవం ఇస్తాను. నాకు మద్యం సేవించే అలవాటు ఉంది. మా నాన్న ఏ బ్రాండ్ తెస్తే దాన్నే ఇద్దరం కలిసి తాగుతాం. మేము తండ్రీకూతుళ్లం మాత్రమే కాదు, మంచి స్నేహితులం. నాన్నకి బ్రేకప్ అయ్యింది, నాకు బ్రేకప్ అయ్యింది.. ఆ బాధలు మర్చిపోవడానికి ఇద్దరం కలిసి తాగుతామని చెప్పుకొచ్చింది.




