
-ఎక్కడరా ఆ విలన్
-అసలు ఎందుకు రావడం లేదు
-హిట్ స్టేటస్ ఎంత
తెలుగు సినిమా(Telugu Cinema)ఎవడి సొత్తు కాదనే మాట అక్షరాలా ఎంత నిజమో.. తెలుగు సినిమా కథాంశం హీరో సొత్తు మాత్రమే కాదు విలన్ ది కూడా. ఎంతలా అంటే విలన్ రోల్ హీరో రోల్ ని డామినేషన్ చేసేంతలా. హీరో అభిమానులు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటారు. బలమైన విలనిజం వల్లే చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ విషయం తెలుగు సినిమా పుట్టిన దగ్గరనుంచి సినీ సాక్ష్యాలతో సహా నిరూపితమవుతూ వస్తుంది. అందుకు ఉదాహరణలు చూపించని సినీ మనిషంటూ ఉండడు. మరి అందులో కొంతమందిని మచ్చుకైనా మరోసారి గుర్తు చేసుకోవడం సినిమాలని ప్రదర్శించే సైట్ గా మన ధర్మం. మరి ఆ లిస్ట్ ఏంటో చూద్దాం.
లేడీస్ ఫస్ట్ అనే సూత్రం ఒకటి పుట్టింది కాబట్టి లేడీ విలనిజం దగ్గరకి వస్తే సూర్యకాంతం, ఛాయాదేవి అద్భుతమైన విలనిజాన్ని ప్రదర్శించి, హీరో, హీరోయిన్ ల కోసమే రిపీట్ ఆడియన్స్ రారు మా కోసం కూడా వస్తారని చాటి చెప్పారు. ఆ తర్వాత ఆ స్థాయిలో లెగసిని కంటిన్యూ చేసే భాగ్యం 'నరసింహ' మూవీ ద్వారా రమ్యకృష్ణకి వచ్చింది. రజనీకాంత్ కి ధీటుగా నీలాంబరి క్యారక్టర్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సినిమా విజయం రేంజ్ ని పెంచడంతో పాటు నీలాంబరిగా తన హావభావాలు, రూపురేఖలు ప్రేక్షకుల మస్తిష్కాల్లో శాశ్వతం అని నిరూపించింది. ఆ తర్వాత సినీ అభిమానులకి ఎలాంటి దిష్టి తగిలిందో ఏమో గాని తన క్యారక్టర్ తోనే సినిమా హిట్ రేంజ్ ని పెంచేంత లేడీ సినీ విలన్ రాలేదు. రావుగోపాలరావు, సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు కంటిన్యూ చేసి తెలుగు సినిమా, ప్రేక్షకుల ఆరాధ్య సినీ నాయకుల్లా మారారు.
మళ్ళీ చాలా ఏళ్ళకి ఇప్పుడు హీరోగా దూకుడు ప్రదర్శిస్తున్న గోపీచంద్ 'జయం', 'నిజం', 'వర్షం' చిత్రాల్లో అదిరిపోయే విలనిజాన్ని ప్రదర్శించి మనోడ్ని బీట్ చేసాడురా బాబు అని హీరో ఫ్యాన్స్ అనుకునేలా చేసాడు. నిజం తప్ప మిగతా రెండు సూపర్ హిట్స్ గా నిలిపాడు. సోనూసూద్ 'అరుంధతి'లో పోషించిన 'పశుపతి' గురించి ఎంత చెప్పినా తక్కువే. తన పెర్ఫార్మ్ తో ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించాడు. అరుంధతి భారీ విజయంలో పశుపతి క్యారక్టర్ సింహభాగంతో పాటు నేటికీ పశుపతి కోసం అరుంధతిని చూసే వాళ్ళ సంఖ్య రికార్డు స్థాయిలో ఉంటుంది.
also read: Mohanlal: ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన మోహన్ లాల్.. ఎక్స్ వేదికగా కీలక ప్రకటన
బాహుబలి సినిమాలో భల్లాలదేవుడిగా రానా చూపించిన శారీరక దారుఢ్యం, కుతంత్రాలు ప్రభాస్ పాత్రకు సరైన జోడీగా నిలిచాయి. ఒక్కడులో ప్రకాష్ రాజ్ పండించిన విలనిజం ఇప్పటికీ మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక గత కొంత కాలం నుంచి హీరోని బీట్ చేసిన సినిమాలు గాని, విలన్ వల్లనే హిట్ అయిన సినిమాలు గాని రాలేదు. ఆ రోజులు మళ్ళీ వచ్చి అసలైన సినీ మజా సెల్యులాయిడ్ పై సాక్షాత్కారం అయితే మాత్రం ప్రేక్షకుడు నయా పుణ్యం చేసుకున్నట్లే.





