Home

»

Latest News

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి.. వధువు కావ్య రెడ్డి ఎవరో తెలుసా!

Mar 7, 2026 2:55PM


సినీ తారల ఇళ్లల్లో పెళ్లిళ్ల హడావిడి 
పెళ్లి పీటలు ఎక్కబోతున్న సాయి శ్రీనివాస్ 
ఆదివారం ఎంగేజ్మెంట్!


నిర్మాత కొడుకు హీరోగా సక్సెస్ కావడమనే విషయంలో తెలుగు సినిమాకి జరిగిన అన్యాయం పాళ్ళు ఎక్కువే. కానీ ఆ అపవాదుని చెరిపేసిన ఇద్దరు, ముగ్గురు హీరోల్లో 'బెల్లంకొండ సాయి శ్రీనివాస్'(Bellamkonda sai Sreenivas)ఒకడు. హిట్టు ప్లాప్ లు సమానంగా పలరిస్తున్నా తను మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. రీసెంట్ గా సాయిశ్రీనివాస్ పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాని ఊపిరి సలపనంత బిజీగా చేస్తున్నాయి. మరి మనం కూడా కాసేపు పూర్తి న్యూస్ తో బిజీ అవుదాం.

సాయిశ్రీనివాస్ ఫియాన్సీ పేరు కావ్య రెడ్డి.. హైదరాబాద్ కి చెందిన అమ్మాయి. తండ్రి లాయర్ కాగా తాత జడ్జి. రేపు( మార్చి 7 ) సాయి శ్రీనివాస్, కావ్య ల  ఎంగేజ్ మెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇరు వైపుల కుటుంబ సభ్యులు హాజరు కాబోతున్నారు. అయితే నిశ్చితార్థం విషయంపై అధికార ప్రకటన మాత్రం రాలేదు. ఏది ఏమైనా మొత్తానికి తెలుగు సినిమా తన వారసుల్నిఒక ఇంటివాళ్ళని చేస్తూ పెళ్లిళ్ల సీజన్ మాలో కూడా ఉంటుందని చెప్తుంది. 

also read: Pawan Kalyan: వాళ్ళని కాపాడుతున్నాడా!.. ప్రముఖ నిర్మాత మాటలు వైరల్ 

సాయి శ్రీనివాస్ సినిమాల విషయానికి వస్తే హైందవ, టైసన్ నాయుడు అనే చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. సాయి శ్రీనివాస్ తండ్రి బెల్లకొండ సురేష్(Bellamkonda Suresh)గత మూడు దశాబ్దాలపై నుంచి చిత్ర సీమలో ఉంటు అగ్ర నిర్మాత హోదాలో ఎన్నో సూపర్ హిట్స్ నిర్మించాడు. ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. కానీ రెస్ట్ కి గుడ్ బై చెప్పి నిర్మాతగా మళ్ళీ బిజీ అవుతానని ఇటీవల చెప్పాడు. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com