
-ప్రస్తుత తెలుగు సినిమా పరిస్థితి ఏంటి
-ఎందుకు వెలవెలబోతున్నాయి
-పరిష్కారం ఏంటి!
ఎగ్జామ్స్ సీజన్ వచ్చేసింది. స్టూడెంట్స్ అందరు ఎంతో టెన్షన్ తో ఎగ్జామ్స్ మూడ్ లో ఉన్నారు. కానీ ఈ నెల 19 న విడుదల కాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వన్ మాన్ షో ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ పార్ట్ 2 పై కూడా ఒక లుక్ వేశారు. ఎలా ఉండబోతున్నాయన్న టెన్షన్ కూడా వాళ్లల్లో ఉంది. అదేంటి పరీక్షలపై ఫోకస్ చేయండని ఎవరైనా చెప్పినా, అక్కడ ఉంది ఎలాంటి సినిమాలు దేని తోవ దానిదే అంటున్నారు. దీన్ని బట్టి ఉస్తాద్, ధురంధర్ 2 పై ఉన్న క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. పైగా ఈ చిత్రాలపై కొన్ని బాధ్యతలు కూడా నెలకొని కొన్నాయని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ (Nattikumar)మా తెలుగు వన్ సినిమా(Telugu One Cinema)ఛానల్ కి చెప్తున్నాడు. ఆ మాటలు చూద్దాం.
ఆయన మాట్లాడుతు ప్రస్తుతం చిత్ర పరిశ్రమ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. మన శంకర వరప్రసాద్ గారు తర్వాత థియేటర్లలో సందడి చేసే సరైన సినిమా రాలేదు. దాదాపు 50 రోజులుగా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. కొన్నిచోట్ల షోలు పడక సెంటర్లు మూసివేసే పరిస్థితి వచ్చింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తాము తెచ్చిన అప్పులకి వడ్డీలు కట్టలేక నష్టాల్లో కూరుకుపోతున్నారు. కేవలం ఒక్క హిట్ తో మొత్తం ఇండస్ట్రీని నడపడం సాధ్యం కాదు. అలాంటి హిట్ లతో కనీసం నాలుగైదు సినిమాలు నిరంతరం రన్నింగ్‌లో ఉండాలి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం యొక్కఉద్రిక్తతలు పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా 'టాక్సిక్' (Toxic) 'దురందర్ 2' (Dhurandhar 2) వంటి పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఓవర్సీస్ మార్కెట్. హిందీ సినిమాలకు మరియు పాన్-ఇండియా చిత్రాలకు అమెరికా, గల్ఫ్ దేశాలు, జర్మనీ మరియు బ్రిటన్ వంటి దేశాల నుండి వచ్చే వసూళ్లు చాలా ముఖ్యం. అక్కడ పరిస్థితులు సజావుగా లేకపోవడంతో, భారీ బడ్జెట్ చిత్రాలు వెనక్కి తగ్గుతున్నాయి.
.
దీంతో అందరి దృష్టి 'ఉస్తాద్ భగత్ సింగ్'(ustaad Bhagatsingh)పైనే ఉంది. పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే పవన్ కళ్యాణ్(Pawan Kalyan)గారి సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ వల్ల వచ్చే నష్టం తక్కువగానే ఉండవచ్చు, ఎందుకంటే ఆయన సినిమాలకి మన లోకల్ మార్కెట్ చాలా బలంగా ఉంటుంది. అందుకే ఈ సినిమాను త్వరగా లేదా అనుకున్న సమయానికి తీసుకురావాలని ఎగ్జిబిటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. ఉగాది వంటి పెద్ద పండుగ సమయంలో సినిమా వస్తే థియేటర్లకు మళ్ళీ కళ వస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
also read: mrithyunjay vs sampradayini suppini suddapoosani: తొలి రోజు కలెక్షన్స్ ఇవే
కానీ ఒకేసారి 5000 థియేటర్లలో వేస్తే, ప్రేక్షకులందరూ మొదటి రోజే చూసేస్తారు. దీనివల్ల రెండో రోజు నుండి కలెక్షన్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది, అందుకే ప్లానింగ్ ప్రకారం థియేటర్లని కేటాయించడం ముఖ్యమని నట్టి కుమార్ చెప్తున్నారు. ఆయన చెప్పినట్టుగానే తెలుగు ప్రేక్షకులకి సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. కానీ గత కొన్నాళ్లుగా థియేటర్లు వెలవెలబోతున్నాయి. సరైన సినిమాలు లేక, ప్రేక్షకులు రాక ఎగ్జిబిటర్లు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఈ తరుణంలో సినిమా కష్టాలు: 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్లకి పూర్వవైభవం తీసుకురావాలని ఆశిద్దాం.
ఇక నట్టి కుమార్ ఏ ముహూర్తాన కోరుకున్నాడో కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ నెల 26 నుంచి ఈ నెల 19 కి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో థియేటర్లు ఉగాది శోభతో కళకళలాడనున్నాయి. ఆయన భయపడినట్టుగా యుద్ధ వాతావరణం నేపథ్యంలో టాక్సిక్ వాయిదా పడింది. ధురంధర్ 2 మాత్రం యధావిధిగా వస్తుంది. మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ కోసం మా తెలుగు వన్ సినిమా(Telugu One cinema) యూట్యూబ్ ఛానెల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.






