
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ తన అభిమానులకి 'అఖండ 2 ' ఇచ్చిన డల్ నెస్ ని 'దాదా' తో పోగొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలలో బాలయ్య జోరు చూస్తుంటేనే ఆ విషయం స్పష్టమవుతూ ఉంది.
షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చిన తరుణంలో, మేకర్స్ నుండి ఫస్ట్ సాంగ్ విడుదల తేదీకి సంబంధించిన ప్రకటన వచ్చేసింది.ఈ విషయంపై దర్శకుడు గోపీచంద్ మలినేని కీలక అప్డేట్ ఇచ్చా డు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాట బాలయ్య అభిమానులకి ప్రత్యేకమైన ట్రీట్‌గా ఉండబోతోందని తెలిపారు.
అంతేకాకుండా వచ్చే వారాంతంలోనే ‘దాదా’ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో బాలయ్య అభిమానుల్లో దాదా సందడి వాతావరణం నెలకొని ఉంది.
.webp)
మరోవైపు ఈ ఫస్ట్ సాంగ్ ఓ స్పెషల్ ఐటెం నంబర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎవరు కనిపించబోతున్నారు? పాట ఎలా ఉండబోతోంది? అనే విషయాలపై ఇంకా అధికారిక స్పష్టత లేదు. వచ్చే వారంలో పాట విడుదలైతే ఈ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: సౌందర్య చనిపోయాక ఆ ఇంట్లో జరిగిన సంఘటన ఇదే: ఆలస్యంగా వెలుగులోకి!
సినిమాకు సంబంధించి మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఎటువంటి ఆలస్యం లేకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారమే షూటింగ్ పూర్తి చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు.

ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా అందిస్తున్న పదునైన సంభాషణలు, బాలయ్య మాస్ కటౌట్‌కు తగ్గట్టుగా ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే రానున్న ఫస్ట్ సాంగ్ రికార్డుల వేటని ఖాయం చేస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. మంచు మనోజ్ ప్రతినాయకుడి ఛాయలున్న రోల్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చవచ్చు: ధనుష్ పొలిటికల్ ఎంట్రీ వెనక ఎవరున్నారో తెలుసా!
మీకు నచ్చవచ్చు: నితిన్ నార్నె శస్త్ర చికిత్స డీటెయిల్స్ ఇవే!





