Home

»

Latest News

Balakrishna: యూకేలో జై బాలయ్య నామస్మరణ.. పేద విద్యార్థుల కోసం 10 లక్షల విరాళం 

Jun 11, 2026 12:10PM

 

గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్ బాలకృష్ణ జన్మదిన వేడుకలు నిన్న ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా ఎంతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అభిమానుల గురించి అయితే చెప్పక్కర్లేదు, ప్రతి సంవత్సరం లాగానే ఘనంగా జరపడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా చేసారు. ఆ సిస్టం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదని,  విదేశాల్లోను నిరంతరాయంగా జరుగుతాయని మరోసారి ఈ బర్త్ డే వేడుక నిరూపించింది.

 
యూనైటెడ్ కింగ్‌డమ్ (UK) లోని లండన్,బర్మింగ్‌హామ్ వంటి నగరాల్లో బాలకృష్ణ అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. "జై బాలయ్య" అనే నినాదాలతో బ్రిటన్ వీధులు మారుమోగిపోయాయి. ప్రవాసాంధ్రులు, నందమూరి అభిమానులు వందల సంఖ్యలో ఒకచోట చేరి తమ అభిమాన హీరో పుట్టినరోజుని ఒక పండుగలా జరుపుకున్నారు. బాలయ్య డైలాగులు, ఆయన సూపర్ హిట్ సాంగ్స్‌తో బ్రిటన్ వీధులు  మార్మోగాయి.

Also read: Ghattamaneni.. ఘట్టమనేని జయకృష్ణ సెకండ్ మూవీ!.. ఆ అగ్ర దర్శకుడు కన్ఫర్మ్! 

సింగపూర్, అమెరికా (USA), ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలలో కూడా ఎన్‌బీకే అభిమానులు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు. లండన్‌లో జరిగిన  ప్రత్యేక కార్యక్రమంలో అభిమానులు భారీ కేక్‌ను కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. దాదాపు 500 మందికి పైగా ప్రవాస తెలుగు ప్రజలు హాజరైన ఈ వేడుకల్లో బాలయ్య నుంచి వచ్చిన  పోస్టర్లు, కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కేవలం కేక్ కటింగ్స్, సంబరాలకే పరిమితం కాకుండా  సామాజిక బాధ్యతని కూడా చాటుకున్నారు. యూకేలోని పలు స్వచ్ఛంద సంస్థలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని పేద విద్యార్థుల చదువుల కోసం  10 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చెయ్యడానికి నిన్న ఈవినింగ్  NBK 111 నుంచి గ్లింప్స్‌ వచ్చిన విషయం తెలిసిందే.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com