Home

»

Latest News

Ghattamaneni.. ఘట్టమనేని జయకృష్ణ సెకండ్ మూవీ!.. ఆ అగ్ర దర్శకుడు కన్ఫర్మ్! 

Jun 11, 2026 11:42AM

 

-శ్రీనివాస మంగాపురంతో ముస్తాబవుతున్న ఘట్టమనేని నయా వారసుడు జయకృష్ణ 
-మరి సెకండ్ మూవీ ఎవరితో 
-సోషల్ మీడియాలో వినిపిస్తున్న న్యూస్ నిజమేనా!
-ఆ అగ్ర దర్శకుడు, అగ్ర సంస్థలో సెకండ్ మూవీ ఉండబోతుందా!

ఘట్టమనేని మూడో తరం వారసుడు జయకృష్ణ(Jayakrishna)'శ్రీనివాస మంగాపురం'తో శరవేగంగా దూసుకురాబోతున్నాడు. ప్రచార చిత్రాలతో హీరో కట్ అవుట్ కి డోకా లేదని అనిపిస్తుండటమే కాకుండా కృష్ణ(Krishna),మహేష్(Mahesh),రమేష్ బాబు(Ramesh Babu) లెగసీని కంటిన్యూ చేయబోతున్నాననే హింట్ అయితే ఫాన్స్ కి ఇచ్చి పడేసాడు. దీంతో  'శ్రీనివాస మంగాపురం' కోసం అందరు రీ గర్ గా వెయిట్ చేస్తున్నారు.


ఇప్పుడు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల దృష్టి సెకండ్ మూవీపై పడింది. ఈ తరుణంలో జయకృష్ణ రెండో మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ పై సోషల్ మీడియాలో ఒక న్యూస్    చక్కర్లు కొడుతుంది. ఒక ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ ,అగ్ర దర్శకుడితో  జయకృష్ణ  రెండో ప్రాజెక్ట్ ఉండబోతుందని, కథ చర్చలు కూడా జరుపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన రూమర్ వినిపిస్తోంది. సదరు దర్శకుడు సైతం ఇప్పటికే ఎన్నో భారీ హిట్స్ ఇచ్చాడని, శ్రీనివాస మంగాపురం రిలీజ్ రోజు సెకండ్ మూవీ అనౌన్స్ మెంట్ వస్తుందని కూడా అంటున్నారు. ప్రస్థుతానికి సెకండ్ మూవీ న్యూస్ రూమరే అయినా, నిజమనే వాళ్ళు కూడా లేకపోలేదు. 


Also read: Bharathiraja: భారతీరాజా ఆస్తుల విలువ ఇంతే! ఇప్పటి హీరోలతో పోల్చుకుంటే

 'శ్రీనివాస మంగాపురం' విషయానికి వస్తే జులై 9 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. . 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' ఫేమ్ అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకుడు కాగా సీనియర్ టాప్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌. జెమినీ కిరణ్ తో కలిసి భారీ చిత్రాల మేకర్  అశ్వనీదత్ నిర్మిస్తున్నాడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీ రోల్  పోషించడం శ్రీనివాస మంగాపురం స్పెషల్.

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com