
బాహుబలి సిరీస్: పేరుకి తగ్గట్టే అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకుంది. రీ రిలీజ్ లో కూడా సేమ్ సిస్టమ్ ని మెయిన్ టైన్ చేస్తు 'బాహుబలి ది ఎపిక్' గా వచ్చి తొలి రోజు 5 కోట్లు రాబట్టింది. ఇప్పటివరకు మన దేశంలో రీ రిలీజ్ అయిన సినిమాల్లో తొలిరోజు కలెక్షన్స్ కి సంబంధించి 'ది ఎపిక్' దే హయ్యెస్ట్.
కానీ ఆ రికార్డుకి చాలా సరదాగా ఎసరు పెట్టింది హాలీవుడ్ మూవీ 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' మార్వెల్ కామిక్స్ సూపర్ హీరోల కథ ఆధారంగా రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం, 'ఎండ్‌గేమ్ ఎన్‌కోర్' పేరుతో నిన్న వరల్డ్ వైడ్ గా రీ రిలీజ్ అయ్యింది. విడుదలైన మొదటి రోజే దేశవ్యాప్తంగా ఏకంగా 7.25 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. గ్రాస్ పరంగా చూస్తే 8.68 కోట్ల రూపాయలు. కేవలం 3,635 స్క్రీన్స్‌లలో మాత్రమే పరిమితంగా విడుదలైనప్పటికీ ఈ స్థాయిలో భారీ వసూళ్లు రావడం మార్వెల్ చిత్రాలకు ఉన్న విపరీతమైన క్రేజ్‌ను మరోసారి స్పష్టం చేస్తోంది.
ఇది కూడా చదవండి: హీరోగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య: నిర్మాత ఎవరో తెలిస్తే షాక్

భాషల వారీగా కలెక్షన్లు పరిశీలిస్తే, ఇంగ్లీష్ వెర్షన్ రూ. 5.25 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, హిందీ వెర్షన్ 1.25 కోట్లు, తెలుగు రాష్ట్రాల నుంచి 45 లక్షలు, తమిళనాడు నుంచి 30 లక్షల వసూళ్లు నమోదు కావడం విశేషం. దీంతో ఎల్లకాలం ఎవరి ఆటలు సాగవనే సంకేతాన్ని బాక్స్ ఆఫీస్ కి చెప్పినట్లయింది.
[Avengers Endgame Encore Beat To Baahubali Collections, Avengers Endgame Encore Collections, Encore Avengers Endgame, Baahubali, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






