Home

»

Latest News

ఆసిన్ కూతురు సంచలనం: ఇది మాములు రికార్డు కాదు!

Oct 26, 2026 6:01PM

 


నాగార్జున, బాలకృష్ణ, సూర్య, రవితేజ వంటి స్టార్ హీరోలతో జత కట్టి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ ఆసిన్. ప్రస్తుతం తను సినిమాలు చేస్తుండకపోయినా తన సినిమాల్లోని పాటలు నిత్యం మారుమోగిపోతూనే ఉంటాయి. 


తాజాగా ఆమె భర్త రాహుల్ శర్మ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆసిన్, రాహుల్ శర్మ దంపతులకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు అరిన్ రేన్ శర్మ. ప్రస్తుతం అరిన్ వయసు  7 సంవత్సరాలు . అయితే ఈ చిన్నారి చూపించే ప్రతిభ చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా ఈ వయసులో పిల్లలు సరిగ్గా రెండు భాషలు మాట్లాడటానికే తికమకపడుతుంటారు. కానీ అరిన్ మాత్రం ఏకంగా 12 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగడం విశేషం. ఇందులో కేవలం సాధారణ భాషలే కాకుండా కొరియన్, జపనీస్, థాయ్, చైనీస్ వంటి కష్టమైన విదేశీ భాషలు కూడా ఉండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తన కూతురి ఈ అద్భుతమైన టాలెంట్ గురించి రాహుల్ శర్మ మురిసిపోతూ పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. తమ ఇంట్లో రెండు భాషలైన ఇంగ్లీష్, హిందీ మినహా వేరే భాషలు మాకే సరిగ్గా రావు అని, కానీ తమ ఏడేళ్ల కూతురు మాత్రం ఏకంగా 12 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిందని  గర్వంగా వెల్లడించారు.   


మరి ఇంత చిన్న వయసులోనే అరిన్‌కు ఈ స్థాయి ప్రతిభ ఎలా సాధ్యమైంది అనే దానిపై రాహుల్ శర్మ చాలా ముఖ్యమైన విషయాలు వెల్లడించారు. నేటి ఆధునిక కాలంలో చాలామంది తల్లిదండ్రులు చిన్న పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్‌లు పెట్టి, గంటల తరబడి టీవీల ముందు కూర్చోబెడుతున్నారు. కానీ ఆసిన్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. అరిన్‌కు ఇప్పటివరకు ఎలాంటి మొబైల్ ఫోన్ స్క్రీన్ టైమ్ ఇవ్వలేదని, అసలు తమ ఇంట్లో టీవీ కూడా లేదని రాహుల్ శర్మ స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్లకు, సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా పెంచడమే తమ పెంపకంలోని అసలైన విజయ రహస్యం అని ఆయన తెలిపారు. టీవీలు, ఫోన్లకు బదులుగా ఆసిన్ తన కుమార్తె చుట్టూ పుస్తకాల ప్రపంచాన్ని సృష్టించారు.   అరిన్ చదివే రెగ్యులర్ స్కూల్‌లో ఉండే లైబ్రరీ పుస్తకాల కంటే కూడా ఎక్కువ పుస్తకాలు తమ ఇంట్లోనే ఉన్నాయని రాహుల్ శర్మ తెలిపారు. 

ఇది కూడా చదవండి: అలీ భార్య జుబేదాకి హార్ట్ సర్జరీ: కన్నీళ్లతో అలీ!

 

 


చిన్నారి అరిన్ ప్రస్తుతం రెండవ తరగతి (క్లాస్ 2) చదువుతుండగా, ఆమె వయసుకు మించి ఏకంగా 8 మరియు 9వ తరగతికి సంబంధించిన సైన్స్, హిస్టరీ, సాహిత్య పుస్తకాలు కూడా ఇంట్లో అందుబాటులో ఉంచారు. "నేను అప్పుడప్పుడు సరదాగా అంటుంటాను, మా అమ్మాయిని నేరుగా పదవ తరగతి బోర్డు పరీక్షలకు కూర్చోబెట్టేసినా పెద్ద తేడా ఏముంటుంది?" అంటూ రాహుల్ శర్మ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ అద్భుతమైన పెంపకం వెనుక పూర్తిగా ఆసిన్ శ్రమ, ఆమె పడిన తపన మాత్రమే ఉందని రాహుల్ బహిరంగంగానే ప్రశంసించారు. తన జీవితంలో తాను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఆసిన్‌ను పెళ్లి చేసుకోవడమేనని, క్లిష్టమైన పరిస్థితుల్లో తన వెన్నంటి నిలిచి ముందుకు నడిపించే శక్తి ఆసిన్ అని ఆయన కొనియాడారు. మొత్తానికి డిజిటల్ యుగంలో పిల్లలకు టెక్నాలజీని దూరం పెట్టి, పుస్తకాలతో అద్భుతమైన భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఆసిన్ పెంపకం నేటి తరానికి నిజంగానే ఆదర్శంగా నిలుస్తోంది.  2016 జనవరిలో ప్రముఖ మైక్రోమాక్స్ కో-ఫౌండర్ రాహుల్ శర్మతో ఆసిన్  వివాహం జరిగింది.

 

[Asin Daughter Arin Speaks 12 languages, Asin daughter Arin, Rahul Sharma interview, Asin 7 year old daughter 12 languages, Asin parenting style, Arin Rayn Sharma, Asin news today, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com