
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘రంగస్థలం’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సుకుమార్ సినిమాలకు ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో.. ఈసారి అనిరుధ్ రవిచందర్ పేరు వినిపిస్తోంది.
సుకుమార్ సినిమా అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేర్లలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. ‘ఆర్య’ నుంచి మొదలైన వీరి ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. ముఖ్యంగా ‘రంగస్థలం’లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. ‘పుష్ప’ సిరీస్‌తో ఈ కాంబో పాన్ ఇండియా ప్రేక్షకులకు కూడా మరింత చేరువైంది. సుకుమార్ విజన్‌కు తగ్గట్టుగా దేవిశ్రీ సంగీతం అందించడం, ఆ పాటలను దర్శకుడు తెరపై మరో స్థాయిలో చూపించడం ఈ కాంబినేషన్ ప్రత్యేకత.
అలాంటి కాంబోలో ఇప్పుడు మార్పు రాబోతుండటం ఆసక్తికరంగా మారింది. 'RC17' కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రంగంలోకి దిగుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అనిరుధ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు అనిరుధ్ ఇచ్చే బీజీఎం సినిమాలకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.
సుకుమార్ తన తదుపరి సినిమాను మరింత భారీ స్థాయిలో రూపొందించాలని చూస్తున్న నేపథ్యంలో.. కొత్త తరహా సౌండ్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనే ఆలోచనతో అనిరుధ్ పేరు పరిశీలనలోకి వచ్చిందా? అనే చర్చ జరుగుతోంది.
మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, ముఖ్యంగా 'ఎల్లమ్మ' సినిమాలో హీరోగా నటిస్తుండటం కూడా ఈ మార్పుకి కారణమై ఉండొచ్చు అంటున్నారు.
ఇది కూడా చదవండి: చివరి నిమిషంలో షాక్.. 'జైలర్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణమేంటి.?
[Anirudh For RC17, RC17 Music Director, Ram Charan Sukumar Movie, RC17 Movie, Ram Charan, Sukumar, Anirudh Ravichander, Devi Sri Prasad, Telugu Film News]




