Home

»

Latest News

పీపీ డుం డుం: అనిరుధ్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరో తెలుసా.?

Oct 17, 2026 3:25PM

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్ తో అనిరుధ్ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ న్యూస్ అఫీషియల్ అయిపోయింది.

సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న సీఎం నివాసానికి వెళ్లిన మారన్ దంపతులు.. తమ కుమార్తె కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. 

ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ అధికారికంగా వెల్లడించింది. నవంబర్ 21న చెన్నైలో ఈ రిసెప్షన్ జరగనున్నట్లు తెలిపింది.

కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి గురించి గత కొన్ని నెలలుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇరు కుటుంబాల నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఈ ప్రచారంపై సందేహాలు కొనసాగాయి. ఇప్పుడు మాత్రం తెలంగాణ సీఎంఓ చేసిన ప్రకటనతో వీరి వివాహ రిసెప్షన్ విషయం అధికారికంగా వెలుగులోకి వచ్చింది.

ఇక పెళ్లి వేడుక నవంబర్ 11న గ్రీస్‌లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పెళ్లి తేదీ, వేదికకు సంబంధించిన పూర్తి వివరాలను ఇరు కుటుంబాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి: కమెడియన్ రామచంద్రకు సంజోష్ ఆర్థిక సాయం.. ఎన్టీఆర్ రంగంలోకి దిగుతారా.?

 

 

 

[Anirudh Kavya Maran Wedding, Kavya Anirudh Wedding Reception, Kavya Anirudh Marriage, Kavya Maran, Anirudh Ravichander, Kalanithi Maran, Revanth Reddy, Sunrisers Hyderabad, Telugu Film News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com