
సినిమాల్లో నవ్వులు పంచే నటులు.. నిజ జీవితంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవారు కూడా ఉండటం అభినందించాల్సిన విషయం. తాజాగా కమెడియన్ రామచంద్రను హీరో సంజోష్ పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం కారణంగా చికిత్స పొందుతున్న రామచంద్రకు తన వంతుగా రూ.15 వేల ఆర్థిక సహాయం చేశారు.
రామచంద్ర ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న సంజోష్.. ఆయనను కలిసి పరామర్శించారు. చికిత్స కోసం ఇంకా సుమారు రూ.8 లక్షలు అవసరమని తెలుసుకుని చలించిపోయారు. ఈ నేపథ్యంలో రామచంద్రకు మరింత సాయం అందేలా తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
ముఖ్యంగా ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని సంజోష్ తెలిపారు. ఎన్టీఆర్ దృష్టికి ఈ విషయం వెళ్తే రామచంద్ర చికిత్సకు అవసరమైన సాయం అందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
"మన సినిమా కుటుంబం ఒక్కటై రామచంద్ర గారికి అండగా నిలుద్దాం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం" అని సంజోష్ పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: 'గాడ్ ఆఫ్ వార్' వెనక్కి.. ఎన్టీఆర్-నెల్సన్ ప్రాజెక్టుకి ముహూర్తం ఫిక్స్.!

[Sanjosh Financial Help to Comedian Ramachandra, Ramachandra Health Update, Comedian Ramachandra, Hero Sanjosh, Jr NTR, Telugu Film News]






