
టాలీవుడ్, కోలీవుడ్ లో ప్రస్తుతం మలయాళీ బ్యూటీలకు మంచి డిమాండ్ ఉంటోంది. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంది యువ నటి అనస్వర రాజన్ (Anaswara Rajan). 'ఛాంపియన్'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె, కేవలం గ్లామర్ గర్ల్‌గా మాత్రమే కాకుండా ఒక పవర్‌ఫుల్ పర్‌ఫార్మర్‌గా ఎదగాలని కోరుకుంటోంది.
ఛాలెంజింగ్ రోల్స్ అంటేనే ఇష్టం
అనస్వర రాజన్ తాజాగా మాట్లాడుతూ తన నటనలో వైవిధ్యం కోసం పరితపిస్తున్నానని, ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉందని తెలిపింది. "నాకు ఛాలెంజింగ్ పాత్రల్లో నటించడం అంటే చాలా ఇష్టం. ఒకే తరహా పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. 'ఈ అమ్మాయి ఇలాంటి పాత్రలో కూడా నటించగలదా?' అని అందరూ చర్చించుకునేలా బలమైన పాత్రల్లో కనిపించాలని ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. కష్టమైన సవాళ్లను ఎదుర్కోవడం తనకిష్టమని, అలాంటి పాత్రల కోసమే ఎదురుచూస్తున్నానని స్పష్టం చేసింది.
కెరీర్ గ్రాఫ్
2017లో మలయాళంలో 'ఉదహరణం సుజాత' సినిమాతో కెరీర్ ప్రారంభించిన అనస్వర, 9 ఏళ్లలోనే దాదాపు 30కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈమె చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళంలో అనస్వర హీరోయిన్ గా పరిచయమైన టీన్ రొమాంటిక్ కామెడీ 'విత్ లవ్' ఈ ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అలాగే కోలీవుడ్ కల్ట్ క్లాసిక్ '7G రెయిన్‌బో కాలనీ' (7G బృందావన్ కాలనీ) సీక్వెల్‌లో హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. తెలుగులో 'ఛాంపియన్' తర్వాత మరిన్ని క్రేజీ ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం 'ఇట్లు అర్జున' సినిమాసినిమా నటిస్తోంది. కొన్ని మలయాళ ప్రాజెక్ట్ లు కూడా చేతిలో ఉన్నాయి.
సోషల్ మీడియాలోనూ అనస్వర రాజన్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
గ్లామర్ డాల్‌గా మాత్రమే కాకుండా, ఒక పవర్ ఫుల్ పర్‌ఫార్మర్‌గా తనను తాను నిరూపించుకోవాలని తాపత్రయపడుతున్న అనస్వర నిర్ణయం పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి. మరి ఈ యంగ్ బ్యూటీ రాబోయే రోజుల్లో ఎలాంటి విభిన్న పాత్రలతో అలరిస్తుందో చూడాలి.






