Home

»

Latest News

‘రాకా’ షాకింగ్ అప్డేట్: 2025లో షూటింగ్ స్టార్ట్.. ఇంకా సగం కూడా పూర్తి కాలేదా.?

Nov 6, 2026 2:39PM

ఒక సినిమా షూటింగ్ మొదలైందంటే ఏడాది లోపే పూర్తవుతుందని అనుకుంటాం. కానీ కొన్ని సినిమాల విషయంలో మాత్రం అంచనాలు తలకిందులవుతున్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్, హైటెక్నికల్ వర్క్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రాలకు ఎక్కువ సమయం పడుతోంది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’ పరిస్థితి కూడా ఇలాగే ఉందా? అంటే ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా టాక్ అవుననే అంటోంది.

‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో ‘రాకా’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ‘జవాన్’తో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ వందల కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ స్థాయి విజువల్ స్పెక్టకిల్‌గా రూపొందిస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దాదాపు ఏడాదిన్నరగా షూటింగ్ జరుగుతున్నప్పటికీ.. ఇప్పటివరకు కేవలం 40 శాతం మాత్రమే చిత్రీకరణ పూర్తయిందని ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దాదాపు రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ జరుగుతున్నా ఇంకా సగం కూడా పూర్తి కాలేదనే వార్త ఇప్పుడు బన్నీ అభిమానుల్లో చర్చకు దారితీస్తోంది.

ఒకవేళ ఈ సమాచారం నిజమైతే.. మిగిలిన 60 శాతం షూటింగ్ పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఆ తర్వాత భారీ స్థాయిలో చేయాల్సిన వీఎఫ్ఎక్స్ పనులకు మరికొంత సమయం అవసరం అవుతుంది. దీంతో ఇప్పటికే ప్రచారంలో ఉన్న 2027 రిలీజ్ ప్లాన్ సాధ్యమవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: మహేష్ మెచ్చిన రామాయణ.. వారణాసి రాముడు ఏమన్నాడంటే.?

అయితే సినిమా ఆలస్యానికి అట్లీ ప్రత్యేకమైన విజన్ కూడా కారణమై ఉండొచ్చని అంటున్నారు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌ను అత్యంత జాగ్రత్తగా తెరకెక్కిస్తూ, విజువల్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ముంబైలో భారీ సెట్స్ నిర్మించి చిత్రీకరణ జరుపుతున్నారు. మరోవైపు అత్యాధునిక మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు. 37 మంది పెర్ఫార్మర్లను ఒకేసారి రియల్ టైమ్‌లో మోషన్ క్యాప్చర్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం ఈ సినిమా స్థాయిని తెలియజేస్తోంది.

మొత్తానికి ‘రాకా’ విషయంలో అసలు ప్రశ్న ఒక్కటే. అట్లీ అనుకున్న విజువల్ వండర్‌ను తెరపైకి తీసుకురావడానికి ఇంత సమయం తీసుకుంటున్నారా? లేక షూటింగ్ షెడ్యూల్స్‌లో ఏమైనా మార్పులు జరిగాయా? అన్నది తెలియాల్సి ఉంది. సినిమా ఆలస్యమైనా పర్వాలేదు.. క్వాలిటీ విషయంలో మాత్రం తగ్గొద్దని బన్నీ అభిమానులు కోరుకుంటున్నారు.

మీకు నచ్చవచ్చు:
అమెరికాలో మెగాస్టార్.. కాకా ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే.?
మహాకాళి 'అయిగిరి నందిని' సాంగ్.. ఎనిమిది నిమిషాలు పూనకాలే.!

 

 

 

[Raaka Shooting 40 Percent Complete, Allu Arjun Raaka Movie, Raaka Movie Shooting Update, Allu Arjun Atlee Movie, Allu Arjun, Atlee, Sun Pictures, Sai Abhyankkar, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com