
అమ్మవారి భక్తి గీతాలకు ఉండే ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా ‘అయిగిరి నందిని’ స్తోత్రం వినిపిస్తుంటే భక్తితో పాటు ఒక తెలియని శక్తి ఆవహించిన ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి అద్భుతమైన స్తోత్రాన్ని ఇప్పుడు వెండితెరపై మరింత గ్రాండ్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ‘మహాకాళి’ మూవీ మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ చూస్తుంటే నిజంగానే గూస్‌బంప్స్ వస్తున్నాయి.
‘హనుమాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రమే ‘మహాకాళి’. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. శ్రీయా రెడ్డి, అక్షయ్ ఖన్నా, రోహిత్ సారఫ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ‘అయిగిరి నందిని’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించిన మహిషాసుర మర్దిని స్తోత్రం ఆధారంగా ఈ పాటను రూపొందించారు. సంగీత దర్శకుడు స్మరణ్ సాయి ఈ భక్తి గీతానికి అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్ జోడించారు. అనిలా రాజీవ్, గీతా మాధురి, సాయి చరణ్ తమ గంభీరమైన స్వరాలతో పాటకు మరింత పవర్ తీసుకొచ్చారు.

దాదాపు 8 నిమిషాల పాటు సాగే ఈ పాటలో సంప్రదాయ భక్తి భావాన్ని ఏమాత్రం తగ్గించకుండా భారీ మ్యూజికల్ ట్రీట్ ఇచ్చారు. పాటలోని బీట్స్, ఆర్కెస్ట్రేషన్, గాయకుల వాయిస్ అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: మహేష్ మెచ్చిన ‘రామాయణ’.. ‘వారణాసి’ రాముడు ఏమన్నాడంటే.?
ఈ లిరికల్ వీడియోలో మహాకాళి అమ్మవారి రూపంలో శ్రీయా రెడ్డి కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకవైపు దుష్టశక్తులను సంహరించే ఉగ్రరూపంలో కనిపిస్తూనే.. మరోవైపు ఓ పసిబిడ్డకు పాలిచ్చే మాతృమూర్తిగా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారిలోని రౌద్రం, వాత్సల్యం అనే రెండు విభిన్న కోణాలను ఈ ఒక్క సన్నివేశంతో చూపించిన తీరు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
ఇక గతంలో విడుదలైన ‘శుక్రాచార్య వార్ క్రై’ గ్లింప్స్‌లో అక్షయ్ ఖన్నా తనదైన ఇంటెన్స్ లుక్‌తో ఆకట్టుకున్నారు. అసుర గురువు శుక్రాచార్యుడిగా ఆయన కనిపించిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇప్పుడు ‘అయిగిరి నందిని’ పాటతో మరోసారి ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అంటే ఒకవైపు శుక్రాచార్యుడి ప్రతాపం.. మరోవైపు మహాకాళి అమ్మవారి శక్తి.. ఇలా సినిమాలో భారీ మైథలాజికల్ యాక్షన్ ఉండబోతున్నట్లు ప్రచార చిత్రాలు సూచిస్తున్నాయి.
ఆర్‌కేడీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2027 జనవరి 8న విడుదల కానుంది. మరి ‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ‘మహాకాళి’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
'ఇట్లు అర్జున' హీరో అనీష్ ఎవరు?.. నాగార్జున, ఎన్టీఆర్ సపోర్ట్ వెనుక అసలు కథ ఇదేనా.?
బాంబు పేల్చిన రెజీనా.. బాలీవుడ్‌లో సౌత్ హీరోయిన్లని ఇంత దారుణంగా చూస్తారా.?
[Mahakali First Single, Aigiri Nandini Song, Mahakali Movie, Prasanth Varma Cinematic Universe, Mahakali Release Date, Puja Aparna Kolluru, Bhoomi Shetty, Akshaye Khanna, Sriya Reddy]





