Home

»

Latest News

ఆల్కహాల్ రిలీజ్ డేట్ ఫిక్స్: సరికొత్తగా కిక్ ఎక్కించడానికి వస్తున్న అల్లరోడు.!

Nov 12, 2026 3:55PM

విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ అనే మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 18న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

మెహర్ తేజ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మానవ ప్రవర్తనలోని విభిన్న కోణాలు, నేర ప్రవృత్తి, మనిషి తీసుకునే నిర్ణయాలు వాటి పర్యవసానాల నేపథ్యంలో ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోంది. 

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా అల్లరి నరేష్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా స్టైలిష్, సరికొత్త లుక్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.

ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన రుహానీ శర్మ నటిస్తుండగా, నిహారిక ఎన్‌ఎం, సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, రఘుబాబు, వెంకటేష్ కాకుమాను, కిరీటి దమరాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇది కూడా చదవండి: 'చార్లీ చాప్లిన్'గా టాలీవుడ్ హీరో.. ఫస్ట్ లుక్ అదిరింది.!

ఈ సినిమాకు ఘిబ్రాన్ సంగీతాన్ని అందిస్తుండగా, చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతాన్ని సమకూరుస్తున్నారు. జిజు సన్నీ సినిమాటోగ్రఫీ, నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విశాల్ అబాని ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆసక్తికరమైన కథాంశం, అల్లరి నరేష్ సరికొత్త అవతారంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ‘ఆల్కహాల్’ డిసెంబర్ 18న ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

మీకు నచ్చవచ్చు:
అసలు ఈ విడాకుల కథ ఏంటి?.. భార్యాభర్తల మధ్య గొడవేంటి.?
శోభన్ బాబుకు స్టార్‌డమ్ తెచ్చిన మూవీ.. 'తాసిల్దార్ గారి అమ్మాయి' వెనుక ఇన్ని విశేషాలా.?

 

 

 

[Alcohol Release Date, Allari Naresh, Ruhani Sharma, Meher Tej, Naga Vamsi]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com