Home

»

Latest News

అఖండ 2 టాక్ ఎలా ఉండబోతుంది!

Dec 01, 2025

 

 

-బాలయ్య సింహగర్జన స్టార్ట్
-మూవీ ఎలా ఉండబోతుంది 
-అభిమానులు ఏమంటున్నారు

 

 


సమయం లేదు మిత్రమా అనే రీతిలో పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై  అఖండ 2(Akhanda 2)తో బాలయ్య(Balakrishna)సింహగర్జన చేసుకుంటూ వస్తున్నాడు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ సింహగర్జన స్థాయి ఏ విధంగా ఉండబోతుందో తెలియయడంతో థియేటర్స్ లోని సౌండ్ బాక్సులుకి ఏం కాకుండా సరికొత్తగా డిజైన్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 5 రిలీజ్ డేట్ అయినా ముందు రోజు నుంచే ప్రీమియర్స్ ప్రదర్శిస్తుండటంతో  అభిమానులు, మూవీ లవర్స్  ప్రీమియర్ షో టికెట్స్ కోసం తమ ప్రయత్నాల్లో ఉన్నారు. 

 

 


ఇక మొదట నుంచి అఖండ 2 పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఘన విజయాన్ని అందుకున్న అఖండ కి సీక్వెల్ కావడం, ఈ సారి బాలయ్య అఘోర గా పూర్తి స్థాయిలో కనిపిస్తుండటం అందుకు కారణం. హైందవ ధర్మం యొక్క గొప్ప తనం కూడా చెప్తుండటంతో పాన్ ఇండియా ప్రేక్షకులు అఖండ 2 రాక కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత అయితే అందరిలో పూర్తి పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. దీంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు అఖండ 2 హిట్ సాధించడం పక్కా. ఈ సారి కూడా గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య సరికొత్త రికార్డులు సృషించబోతున్నాడు. ఆ రికార్డుల యొక్క సౌండ్ సౌత్ నుంచి నార్త్ దాకా చాలా గట్టిగానే వినపడబోతుందనే  అభిపాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

 

also read:  నాగచైతన్య ఏం చేస్తున్నాడు.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా 

 

రీసెంట్ గా అఖండ 2 సెన్సార్ ని పూర్తి చేసుకుంది. పిల్లలు, పెద్దవాళ్ళు కలిసి కుటుంబ సమేతంగా కలిసి చూసే విధంగా యు/ ఏ సర్టిఫికెట్ ని సెన్సార్ వాళ్ళు ఇచ్చారు. ఈ విషయం కూడా మూవీకి కలిసి వచ్చే అంశం. సెన్సార్ నుంచి పాజిటివ్ టాక్ రావడం అభిమానులని సంతోషపరిచే మరో అంశం.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com