Home

»

Latest News

Ajith Kumar: అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. శోక సంద్రంలో అజిత్ 

May 30, 2026 11:12AM

 

 

-అగ్ర హీరో అజిత్ ఇంట్లో విషాదం 
-తల్లి మోహినీ మణి కన్నుమూత 


కోలీవుడ్ స్టార్ హీరో, తెలుగుప్రేక్షకులకి  కూడా ఎంతో సుపరిచితులైన నటుడు అజిత్ కుమార్(Ajith Kumar)ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అజిత్ కుమార్ మాతృమూర్తి మోహినీ మణి (84) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య రీత్యా వచ్చే  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియడంతో అజిత్ అభిమానులతో పాటు యావత్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది.  

మోహినీ మణి (Mohini Mani) కోల్‌కతాకి  చెందిన సింధీ కుటుంబానికి చెందిన మహిళ. ఆమె కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన పి.ఎస్. మణిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి అనూప్ కుమార్, అజిత్ కుమార్, అనిల్ కుమార్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. గత ఏడాది 2023 మార్చి 24న అజిత్ తండ్రి పి.ఎస్. మణి (85) అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. సరిగ్గా మూడేళ్ల వ్యవధిలోనే అజిత్ తల్లి కూడా మరణించడంతో ఆ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయినట్లయింది. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన అజిత్ కుమార్ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.  అజిత్ కుమార్ తల్లి మోహినీ మణి మరణవార్త తెలుసుకున్న తమిళ, తెలుగు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ సానుభూతిని ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అజిత్ కుటుంబానికి ధైర్యం చెబుతూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

also read:  తెర లోపల నుంచి ప్రేక్షకుల్లోకి దూసుకొచ్చిన కారు..ముమ్మాటికీ ఇది వాళ్ళ పనే

చెన్నై పాలవాక్కంలోని అజిత్ నివాసానికి పలువురు సినీ నటులు చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. అయితే, అజిత్ కుటుంబ ఆచారం ప్రకారం అంత్యక్రియలు అత్యంత సాదాసీదాగా, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కష్టసమయంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని అజిత్ కుటుంబ సభ్యులు కోరారు.తమ అభిమాన హీరో తల్లి మరణించారనే వార్త వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అజిత్ కుమార్ (AK) అభిమానులు సోషల్ మీడియాలో 'RIP Amma' అంటూ పోస్టులు పెడుతున్నారు. అమ్మపై అజిత్‌కు ఉన్న ప్రేమాభిమానాలు అందరికీ తెలిసినవే కావడం వల్ల, ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఆ భగవంతుడు అజిత్‌కు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారు. సినిమా షూటింగులలో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే అజిత్, తన మాతృమూర్తి కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com