TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ట్విస్ట్ ఇచ్చిన శ్రీకాంత్.. త్వరలోనే నటి జ్యోతితో పెళ్ళి..!

Nov 19, 2024 4:48PM

సీనియర్ నటుడు నరేష్, పవిత్ర ప్రేమకథ అప్పట్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో సినీ జంట ప్రేమకథ వార్తల్లో నిలిచింది.

వివాదాస్పద వ్యాఖ్యలతో నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ పేరు తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే ఈసారి పెళ్ళి కబురుతో ఆయన పేరు వార్తల్లో నిలిచింది. తాజాగా తనకు నటి జ్యోతి ముద్దు పెడుతున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రీకాంత్.. "క్రష్ ఆఫ్ మై లైఫ్" అంటూ రాసుకొచ్చాడు. అంతేకాదు "మీ దేవుళ్లు మాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా?" అనే లైన్ ని కూడా జోడించాడు. శ్రీకాంత్ పోస్ట్ చూస్తుంటే ఆయన త్వరలోనే జ్యోతిని పెళ్ళి చేసుకోబోతున్నాడనే అభిప్రాయం కలుగుతోంది.

google-ad-img