
శ్రీకాంత్.. ఈ పేరుకి ఉన్న కెపాసిటీ తెలిసిందే. మైటీ స్టార్ హోదాలో అనేక మంది అభిమానులని సంపాదించడంతో పాటు ఎన్నో శతదినోత్సవ చిత్రాలని కూడా తన ఖాతాలో భద్రంగా దాచుకున్నాడు. ప్రస్తుతం కూడా హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సత్తా చాటుతు తెలుగు సినిమాపై తన ప్రతిబింబం యొక్క ఛాయలని ప్రతిభింబిస్తూనే ఉన్నాడు.
రీసెంట్ గా శ్రీకాంత్ తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాడు. ఆయన అంజన్నను దర్శించుకోవడం ఇది నాల్గోసారి కావడం విశేషం.
స్వామివారిపై ఉన్న అంతులేని భక్తిభావంతో శ్రీకాంత్ వరుసగా ఇక్కడికి వస్తుండటం భక్తులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన కొండగట్టు క్షేత్రానికి చేరుకోగానే, ఆలయ అర్చకులు మరియు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికిన అనంతరం, హీరో శ్రీకాంత్ గర్భగుడిలోకి వెళ్లి స్వయంగా అంజన్న స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఘనంగా ఆశీర్వదించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇది కూడా చదవండి: అన్నా లెజినోవా ఆస్తులు ఎన్నో తెలుసా!
కొండగట్టు క్షేత్రంపై తనకు గల ప్రత్యేకమైన నమ్మకం కారణంగానే, తాను ఇక్కడికి నాల్గోసారి రావడం జరిగిందని శ్రీకాంత్ ఈ సందర్భంగా సన్నిహితులతో పంచుకున్నారు.

శ్రీకాంత్ ని చూడటానికి కొండగట్టు పరిసర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో అభిమానులు, స్థానిక ప్రజలు తరలి వచ్చారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. అంజన్న దీవెనలతో తెలుగు చిత్ర పరిశ్రమలో మరిన్ని విజయాలు అందుకోవాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ప్రార్థించినట్లు తెలుస్తోంది.
మీకు నచ్చవచ్చు : ఎందుకు ఈ దర్శకులు ప్లాప్ అవుతున్నారు!
మీకు నచ్చవచ్చు: వర్మ వ్యాఖ్యలు వైరల్: ఆ హీరో స్టార్ పవర్ అదుర్స్!
[Actor Srikanth Kondagattu Visit, Actor Srikanth, Kondagattu Anjanna, Srikanth Kondagattu Temple, Tollywood Actor Srikanth Visit, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






