రేపే హీరో నిఖిల్ పెళ్లి
on May 13, 2020
ఫిబ్రవరి 1న హీరో నిఖిల్ తన గాళ్‌ఫ్రెండ్ పల్లవీ వర్మతో సంప్రదాయ పద్ధతిలో నిశ్చితార్ధం జరుపుకున్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ప్రైవేట్ వ్యవహారంలా ఆ కార్యక్రమం జరిగింది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పెళ్లి వేడుకను గ్రాండ్‌గా చేసుకోవాలని భావిస్తున్నానని అతడు చెప్పాడు. అందువల్లే లాక్డౌన్ టైమ్‌లో జరగాల్సిన పెళ్లిని పోస్ట్‌పోన్ చెయ్యాలని వారి కుటుంబాలు నిర్ణయించాయి. అయితే లాక్డౌన్ ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించకపోవడంతో మే 14న పల్లవి మెడలో మూడు ముళ్లు వేయాలని నిఖిల్ నిశ్చయించుకున్నాడు. షామిర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌లో గురువారం (మే 14) ఉదయం 6:31 గంటలకు ఈ వేడుక జరుగుతుందనీ, కేవలం రెండు కుటుంబాల సభ్యులు మాత్రమే దీనికి హాజరవుతారనీ సమాచారం.
తన గాళ్‌ఫ్రెండ్ పల్లవి గురించి మాట్లాడుతూ, తామిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నామని నిఖిల్ తెలిపాడు. తను షూటింగ్‌తో బిజీగా ఉన్న సమయంలో ఆమె ఎప్పుడూ తనను డిస్టర్బ్ చేయదని, తన ప్రైవసీని ఆమె గౌరవిస్తుందని చెప్పాడు. చాలా కాలంగా నిఖిల్ లవ్ ఎఫైర్ వార్తల్లో నలుగుతూ వస్తోంది. గత ఏడాది ఒక టాక్ షోలో లక్ష్మి మంచుతో మాట్లాడుతూ తాను సింగిల్ కాదనీ, తను ప్రేమలో ఉన్నాననే విషయాన్ని తొలిసారి బహిర్గతం చేశాడు.
టాలీవుడ్లో ప్రస్తుతం వరుసగా పెళ్లిళ్ల ఖాయమవుతున్నాయి. ఇటీవలే నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారు. మరోవైపు హీరో నితిన్ ఏప్రిల్‌లో షాలినిని పెళ్లాడాల్సి ఉండగా, లాక్డౌన్ నేపథ్యంలో పెళ్లిని పోస్ట్‌పోన్ చేసుకున్నాడు. రానా దగ్గుబాటి తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను పరిచయం చేశాడు.