Home

»

Latest News

మెహర్ రమేష్ ఇంట్లో విషాదం

Feb 07, 2026

 

 

-ఇనిస్టా పోస్ట్ వైరల్ 
-అభిమానులు,నెటిజన్స్ సానుభూతి 
-పద్మావతి ఎవరు 

 

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)ఇచ్చిన అవకాశంతో 'కంత్రి' తో దర్శకుడిగా తెలుగు సినీ రంగానికి 'ఎంట్రీ ఇచ్చాడు మెహర్ రమేష్(Meher Ramesh). మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి సోదరుడు వరుసైన మెహర్ రమేష్ రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేసాడు. దీంతో అభిమానులతో పాటు  నెటిజెన్స్ సదరు పోస్ట్ చూసి తమ సానుభూతిని   తెలియచేస్తున్నారు. సదరు పోస్ట్ లో ఏముందో చూద్దాం.

 
మా అత్తమ్మ పద్మావతి శివైక్యం చెందారు. ఇన్నాళ్లు మా అమ్మని తనలో చూసుకున్నాను. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మా అమ్మ వెంకట సుబ్బమ్మ గారు 2003 7th ఫిబ్రవరి పరమపదించారు సరిగ్గా అదే తేదీన అత్తమ్మ కి ఆఖరి వీడ్కోలు మా కుటుంబానికి తీరని లోటని భావోద్వేగ వ్యాఖ్యలు చేసాడు.  2023 లో భోళా శంకర్ తర్వాత మళ్ళీ తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు.

 

Also read:  ఏడేళ్ల పాటు మంచానికే పరిమితం.. రీజన్ ఇదే 

 

మెహర్ రమేష్ సినీ కెరీర్ విషయానికి  వస్తే కంత్రి కంటే ముందే  ఆంధ్రావాలా, ఒక్కడు సినిమాలని కన్నడ లో పునీత్  రాజ్ కుమార్ తో రీమేక్ చేసి హిట్ అందుకున్న రికార్డు మెహర్ రమేష్ కి ఉంది. తెలుగులో మాత్రం ఎందుకనో హిట్ అనేది మెహర్ రమేష్ కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తు వస్తుంది. మరి  అప్ కమింగ్ చిత్రాలతో అయినా విజయాల్ని అందుకుంటాడేమో చూడాలి. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com