ఆ ఇద్దర్నీ తట్టుకోవడం ధనుష్ వల్ల అవుతుందా?
on Feb 7, 2026

‘అమరన్’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్‌లో తమిళ స్టార్ హీరో ధనుష్ 55వ సినిమా ప్రారంభమైంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్ప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ చిత్రాన్ని ధనుష్‌కు చెందిన వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.
ఫిబ్రవరి 7న ఈ సినిమా ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ వేడుకకు ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరై టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన సాయిపల్లవి, శ్రీలీల నటిస్తుండడం విశేషంగా చెప్ప్పుకోవచ్చు. శ్రీలీల ఎంత గొప్ప డాన్సరో అందరికీ తెలిసిందే. సాయిపల్ల విషయానికి వస్తే.. డాన్సులతోపాటు నటనలోనూ తనకు తనే సాటి అనిపించుకున్న హీరోయిన్. మరి వీరిద్దరి ధాటికి ధనుష్ ఎలా తట్టుకుంటాడో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి గురించి చెప్పాలంటే... 2017లో ‘రంగూన్’ అనే తమిళ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ నిర్మించడం విశేషం. ఆ తర్వాత 2024లో శివకార్తికేయన్‌తో చేసిన ‘అమరన్’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్ప్పుడు ధనుష్‌తో చేయబోయే సినిమా కూడా అందర్నీ ఆకట్టుకునే విభిన్నమైన కథాంశంతో ఉంటుందట.
ధనుష్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ యాంగిల్‌లో కనిపిస్తారని చెబుతున్నారు. అమరన్‌లో హీరోయిన్‌గా నటించిన సాయిపల్లవికి రాజ్‌కుమార్‌తో ఇది రెండో సినిమా. శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ‘పరాశక్తి’ చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు తమిళ్‌లో రెండో సినిమా. ధనుష్, రాజ్‌కుమార్ కాంబినేషన్‌లో సినిమా అంటే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం సహజం. ఇప్ప్పుడు సాయిపల్లవి, శ్రీలీల కూడా ఈ సినిమాలో భాగమవుతుండడంతో సినిమాకి ఉన్న హైప్ రెట్టింపు అయిందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో ధనుష్, సాయిపల్లవి, శ్రీలీల ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



