మాస్ కాంబో: ఎన్టీఆర్ సినిమాలో రవితేజ.!
Nov 29, 2026 4:09PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా భాగం కాబోతున్నారనే ప్రచారం మొదలైంది. అనిల్ రావిపూడి రవితేజ కోసం ఓ ప్రత్యేకమైన పాత్రను సిద్ధం చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతోంది.
ఎన్టీఆర్‌లోని కామెడీ టైమింగ్‌ను మరోసారి బయటకు తీసుకొచ్చేలా అనిల్ రావిపూడి ఈ కథను సిద్ధం చేస్తున్నారట. పూర్తిస్థాయి వినోదంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఎలివేషన్స్, ఊహించని ట్విస్టులు ఉండేలా స్క్రిప్ట్‌ను రూపొందిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రవితేజ పాత్ర కూడా కీలకంగా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. కేవలం గెస్ట్ రోల్ కాకుండా కథను మలుపు తిప్పే కీలక పాత్రను ఆయన కోసం రాస్తున్నారట.
గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రవితేజ నటిస్తున్నారని ప్రచారంతో ఈ ప్రాజెక్టుపై మరింత బజ్ ఏర్పడింది.
ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ షూటింగ్‌తో బిజీగా ఉండగా, అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’ సినిమాతో బిజీగా ఉన్నారు.
ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాక ఎన్టీఆర్–అనిల్ రావిపూడి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. మరి రవితేజ కూడా ఈ సినిమాలో నటిస్తారా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన మల్టీస్టారర్ చూడొచ్చు.
ఇది కూడా చదవండి: అనిల్ రావిపూడి డ్రీమ్ ప్రాజెక్ట్.. రామాయణం అనౌన్స్‌మెంట్!
[Jr NTR, Ravi Teja, Anil Ravipudi, January 12 Vidudala, Dragon]



