Home

»

Gossips

Rajinikanth: రజనీకాంత్‌ సినిమాలో విలన్‌గా స్టార్ డైరెక్టర్?

Apr 24, 2026

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్టే. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'శివాజీ', 'రోబో', '2.0' సినిమాలు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే, త్వరలో రాబోతున్న #Thalaivar173 ప్రాజెక్టు గురించి ఇప్పుడు ఒక షాకింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈసారి శంకర్ దర్శకత్వం వహించడం లేదు.. రజనీకి విలన్‌గా నటించబోతున్నారట.

రజనీకాంత్ తన 173వ సినిమాను సిబి చక్రవర్తి దర్శకత్వంలో చేయనున్నారు. కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి వినిపిస్తున్న తాజా వార్త ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఇందులో విలన్ పాత్ర కోసం ఏకంగా దర్శకుడు శంకర్‌ను సంప్రదించినట్లు సమాచారం.

దర్శకుడిగా మారకముందు శంకర్ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. అయితే, పూర్తిస్థాయి విలన్ పాత్రలో ఆయన కనిపించడం ఇదే మొదటిసారి అవుతుంది. రజనీకాంత్ వంటి మాస్ హీరోకు దీటుగా ఉండే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో శంకర్ కనిపిస్తే కొత్తగా ఉంటుంది. ఒకవేళ ఇది నిజమైతే, వెండితెరపై శంకర్-రజనీ మధ్య పోరు చూడటం ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుంది.

ఈ సినిమాలో మరో సర్‌ప్రైజ్ ఏంటంటే.. లోకనాయకుడు కమల్ హాసన్ ఒక కీలకమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నారని టాక్. రజనీకాంత్, కమల్ హాసన్, శంకర్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

శంకర్ విలనిజం, రజనీ స్వాగ్ కలగలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com