సినీ రంగంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, పెళ్లి, బ్రేకప్ వార్తలు రావడం సర్వసాధారణం. అయితే తాజాగా కోలీవుడ్ వర్గాలతో పాటు టాలీవుడ్‌లోనూ ఒక షాకింగ్ గాసిప్ తీవ్ర కలకలం రేపుతోంది. వైవిధ్యమైన నటనతో మెప్పించే స్టార్ హీరో ధనుష్, అందాల భామ మృణాల్ ఠాకూర్ మధ్య నడుస్తోందని ప్రచారం జరిగిన ప్రేమాయణం ఇప్పుడు ముగిసిందంటూ నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి.
కొన్ని నెలలుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపించిన ఊహాగానాలకు ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ధనుష్, మృణాల్ తమ బంధానికి స్వస్తి చెప్పాలని డిసైడ్ అయ్యారట. ఎవరి కెరీర్‌పై వారు దృష్టి పెట్టేందుకు పరస్పర అంగీకారంతోనే ఈ క్రేజీ జంట సైలెంట్‌గా విడిపోయినట్లు ట్రెండ్ అవుతున్న వార్తల సారాంశం.
అయితే అసలు వీరు ఎప్పుడు ప్రేమలో పడ్డారు, అప్పుడే విడిపోవడానికి దారితీసిన కారణాలు ఏంటనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉన్నాయి. ఈ విడిపోవడం వెనుక ఉన్న అసలు కారణం తెలియక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. కాగా, ఈ ప్రచారంపై అటు ధనుష్ కానీ, ఇటు మృణాల్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.
గతంలో మృణాల్ ఠాకూర్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక ఈవెంట్‌లో ధనుష్ సందడి చేయడంతో వీరి మధ్య ఏదో నడుస్తోందనే అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరు తారలు పలుమార్లు కలిసి కనిపించడంతో ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఇటీవల వీరిద్దరి పెళ్లి దుస్తుల ఏఐ ఫొటోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే.





