
సినిమాల్లో పాత్రకు తగ్గట్టుగా హీరోలు తమ శరీరాకృతిని మార్చుకోవడం సహజం. ముఖ్యంగా భారీ యాక్షన్ సినిమాల కోసం సిక్స్ ప్యాక్‌తో కనిపించేందుకు ప్రత్యేకంగా కసరత్తులు చేస్తుంటారు. అయితే ఓ భారీ పాన్ ఇండియా మూవీ విషయంలో మాత్రం సిక్స్ ప్యాక్ అంశం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాలో నటిస్తున్న స్టార్‌ను సిక్స్ ప్యాక్‌తో కనిపించాలని దర్శకుడు కోరారట. అందుకు తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. అయితే ఆ హీరో అనుకున్న స్థాయిలో సిక్స్ ప్యాక్ సాధించలేకపోయారని, అంతేకాకుండా ఈ విషయంలో ఆయనకు పెద్దగా ఆసక్తి కూడా లేదని ప్రచారం జరుగుతోంది.
దీంతో షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో AI, VFX సాంకేతికతను ఉపయోగించి హీరోకి సిక్స్ ప్యాక్ ఉన్నట్లుగా చూపించాలనే ఆలోచనకు డైరెక్టర్ వచ్చినట్లు టాక్.
నిజానికి ఈ పద్ధతిని అనుసరించడం దర్శకుడికి ఏమాత్రం ఇష్టం లేద, సహజంగా హీరో శారీరకంగా సిద్ధమై తెరపై కనిపిస్తే వచ్చే ప్రభావం వేరుగా ఉంటుందని ఆయన భావిస్తున్నారట. కానీ షూటింగ్ ఆలస్యమయ్యే పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు మరో మార్గం లేక ఈ దారిని ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి: ప్రభాస్‌తో సినిమా.. ఆ యాంగిల్‌నే చూపిస్తానంటున్న త్రివిక్రమ్.!

[Tollywood Star, AI Six Pack, Six Pack VFX, Telugu Hero, Body Transformation, Tollywood Hero, Telugu Film News, Telugu Movie News]





