ENGLISH | TELUGU  
Home  » Gossips

మెగా ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్ మారుతి!

on Feb 11, 2026

 

డైరెక్టర్ మారుతికి హీరో దొరికేశాడా?
మారుతితో సినిమాకి సై అంటున్న మెగా హీరో ఎవరు?

 

'ఈ రోజుల్లో', 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు', 'ప్రతిరోజూ పండగే' వంటి చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ మారుతి(Maruthi). అలాంటి మారుతికి 'ది రాజా సాబ్'(The Raja Saab) రూపంలో ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)తో భారీ బడ్జెట్ సినిమా చేసే అవకాశమొచ్చింది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన రాజాసాబ్ దారుణంగా నిరాశపరిచింది. దీంతో మారుతి నెక్స్ట్ మూవీ ఏ హీరోతో ఉంటుందనే ఆసక్తి నెలకొంది.

 

'ది రాజా సాబ్' హిట్ అయ్యుంటే.. ప్రభాస్ బాటలోనే పయనించి వేరే స్టార్లు కూడా మారుతికి అవకాశం ఇచ్చి ఉండేవారేమో. కానీ రిజల్ట్ తేడా కొట్టడంతో మళ్ళీ మారుతి మీడియం రేంజ్ సినిమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే యంగ్ హీరోలకు సరిపోయేలా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడట. ఈ కథను మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej)ను దృష్టిలో పెట్టుకొని రాస్తున్నట్లు తెలుస్తోంది. సాయి తేజ్ సైతం మారుతితో సినిమా చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

 

సాయి ధరమ్ తేజ్, మారుతి కాంబినేషన్ లో గతంలో 'ప్రతిరోజూ పండగే' వంటి హిట్ ఫిల్మ్ వచ్చింది. మరోసారి అలాంటి ఎంటర్టైనర్ తో మంచి హిట్ కొట్టి సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని మారుతి చూస్తున్నాడట.

 

ప్రస్తుతం సాయి తేజ్ 'సంబరాల ఏటిగట్టు' అనే పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. దీని తర్వాత మారుతి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది.

 

Also Read: 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాకి A సర్టిఫికెట్.. ఎందుకో తెలుసా?

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.