Home

»

Gossips

విజయ్, రష్మికల పెళ్లి చూడాలంటే 60 కోట్లు కట్టాల్సిందేనా?

Feb 13, 2026

టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇక రష్మిక మందన్న నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకొని దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుబోతున్నారని గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తున్న మాట. అయితే అధికారికంగా ఈ జంట ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ వారిద్దరూ ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం, పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేయడం వంటివి సోషల్ మీడియాలో జరిగిపోతూనే ఉన్నాయి. 

 

కొంతకాలం క్రితం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల నిశ్చితార్థం జరిగిందనే వార్త వచ్చింది. ఫిబ్రవరి 26 ఈ జంట పెళ్లి చేసుకోబోతోంది అని ప్రచారం జరుగుతోంది. అయితే తమ పెళ్లికి సంబంధించిన ఎలాంటి వివరాలు ఈ జంట ఇప్పటివరకు ప్రకటించలేదు. సోషల్ మీడియాలో మాత్రం పెళ్లి హడావిడి మొదలైపోయింది. ఇప్పటికే వీరి ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన స్టిల్స్ వైరల్ అయిపోయాయి. ఇక పెళ్లి కోసం వీరి అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. 

 

ఇదిలా ఉంటే.. ఇప్ప్పుడు మరో కొత్త వార్త వైరల్‌గా మారింది. ఫిబ్రవరి 26న జరగనున్న విజయ్, రష్మికల పెళ్లి వేడుక వీడియో రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందనేది ఆ వార్త. సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ వీడియో రైట్స్ భారీ స్థాయిలో అమ్ముడుపోవడం మనం చూస్తున్నాం. అందులో భాగంగానే నెట్‌ఫ్లిక్స్ ఈ భారీ ఆఫర్‌తో విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లిందని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ చేసిన ఎమౌంట్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ వేడుక స్ట్రీమింగ్ కోసం 60 కోట్ల రూపాయలు చెల్లించేందుకు నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. 

 

విశేషం ఏమిటంటే.. అంత భారీ ఆఫర్‌ను కూడా విజయ్ దేవరకొండ తిరస్కరించారని తెలుస్తోంది. జీవితంలో జరిగే ముఖ్యమైన వేడుకను క్యాష్ చేసుకునేందుకు తాను సిద్ధంగా లేనని విజయ్ చెప్పినట్టు సమాచారం. ఆ మధురమైన క్షణాలను తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల మధ్య జరుపుకోవాలని, ఆ జ్ఞాపకాలను ప్రైవేట్‌గానే ఉంచుకోవాలని తాను భావిస్తున్నానని తెలిపారట. పెళ్లి గురించి గానీ, ఈ వీడియో రైట్స్ గురించి గానీ ఈ జంట‌ ఎక్కడా ప్రస్తావించకపోయినా న్యూస్ మాత్రం వైరల్ అయిపోతోంది. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com