ENGLISH | TELUGU  

ఆ అవమానంతో సూపర్‌స్టార్ అయ్యేవరకు ఎ.వి.ఎం. స్టూడియోలో అడుగుపెట్టని రజినీకాంత్!

on Feb 17, 2026

సూపర్‌స్టార్ రజినీకాంత్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ వెళుతున్న సమయంలో ఒక నిర్మాత ఆయన్ని అవమానించారు. దాన్ని పాజిటివ్‌గా తీసుకొని పట్టుదలతో నటుడిగా తనను తాను తీర్చి దిద్దుకొని సూపర్‌స్టార్‌గా ఎదిగారు. మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకున్న తర్వాత కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ’ చిత్రంలో చిన్న క్యారెక్టర్ చెయ్యడం ద్వారా నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. రెండో సినిమాగా పుట్టన్న కణగల్ దర్శకత్వంలో ‘కథా సంగమ’ చిత్రంతో కన్నడలో పరిచయమయ్యారు. ఈ రెండు సినిమాý వరకు రజినీకాంత్ పేరు శివాజీరావుగానే ఉంది.

 

1976లో కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అంతులేని కథ’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు శివాజీరావు. అప్పటికే శివాజీ గణేశన్ హీరోగా ఉండడంతో ఒకే పేరుతో ఇద్దరు నటులు ఉండకూడదని, అతన్ని పేరు మార్చుకోమని చెప్పి మూడు ఆప్షన్స్ ఇచ్చారు బాలచందర్. చంద్రకాంత్, రవికాంత్, రజినీకాంత్.. ఈ మూడు పేర్లలో ఒకటి సెలక్ట్ చేసుకోమని చెప్పారు. అప్ప్పుడు రజినీకాంత్ పేరును సెలక్ట్ చేసుకున్నారు శివాజీరావు. అలా ‘అంతులేని కథ’ చిత్రం నుంచి రజినీకాంత్‌గా చలామణి అవుతున్నారు. ఈ సినిమాలో రజినీ చేసిన క్యారెక్టర్‌కి విపరీతమైన పేరు వచ్చింది. అంతేకాదు, ఆయనపై చిత్రీకరించిన ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి..’ అనే పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ పాటలో సిగరెట్‌ని ఎగరేసి పట్టుకునే విధానం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. 

 

ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సహనటుడిగా చేస్తూ వస్తున్న రజినీకి ఒక సినిమాలో హీరోగా నటించే అవకాశం ఇచ్చారు ఓ నిర్మాత. ఆ సినిమాకి 6 వేలు రెమ్యునరేషన్‌గా ఫిక్స్ చేశారు. షూటింగ్ స్టార్ట్ అయిన రోజు ఆ మొత్తం ఇస్తానని చెప్పారు. ఒకరోజు రజినీకాంత్‌ని ఎ.వి.ఎం. స్టూడియోకి తీసుకెళ్లేందుకు కారు వచ్చింది. స్టూడియోకి వెళ్లిన తర్వాత తన రెమ్యునరేషన్ గురించి అడిగారు రజినీ. ముందు షూటింగ్‌లో పాల్గొనమని చెప్పారు నిర్మాత. కానీ, రెమ్యునరేషన్ ఇస్తేనే నటిస్తానని చెప్పారు రజినీ. దానికి సీరియస్ అయిన ఆ నిర్మాత ‘నువ్వేమైనా సూపర్‌స్టార్‌వా.. డబ్బు ఇస్తేనేగానీ చెయ్యవా?’ అన్నారు. ‘చెయ్యను’ అన్నారు రజినీ. ‘అయితే వెళ్లిపో’ అంటూ కసురుకున్నాడు. 

 

తనను ఇంటి దగ్గర నుంచి ఎలా తీసుకొచ్చారో అలాగే తీసుకెళ్లమని అడిగారు రజినీ. దానికా నిర్మాత ఒప్ప్పుకోలేదు. కారు ఇవ్వనని, వెళ్లిపొమ్మని చెప్పారు. చేసేదిలేక వెనక్కి వచ్చేశారు. తను సూపర్‌స్టార్ అయ్యేవరకు మళ్ళీ ఎ.వి.ఎం. స్టూడియోలో అడుగుపెట్టకూడదని ఆరోజే నిర్ణయించుకున్నారు రజినీకాంత్. ఇక అప్పటి నుంచి ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూ వచ్చారు. 1977లో 15 సినిమాల్లో నటించారు రజినీ. వాటిలో తమిళ్, తెలుగు, కన్నడ సినిమాలు ఉన్నాయి. 1978లో 22 సినిమాలు చేశారు. వాటిలో సోలో హీరోగా నటించిన తమిళ సినిమా ‘భైరవి’ కమర్షియల్‌గా పెద్ద హిట్ అవ్వడంతో రజినీకాంత్ స్టార్ హీరో అయిపోయారు. త‌న‌కు ఎదురైన అవ‌మానాల‌ను ఛాలెంజ్‌గా తీసుకొని నటుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ సూపర్‌స్టార్ అయ్యారు రజినీకాంత్. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.