Home

»

Bollywood News

Salman Khan: పర్మినెంట్ గా ఇల్లు ఖాళీ చేస్తున్న సల్మాన్.. ఆ ఒక్కడే కారణమా!

Jun 27, 2026 4:23PM

స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan)తన కుటుంబ భద్రత కోసం అత్యంత కీలకమైన  నిర్ణయం తీసుకున్నారు. ఒక రకంగా సదరు నిర్ణయం సంచలనం కూడా.  గత ఐదు దశాబ్దాలుగా  నివాసం ఉంటున్న ముంబై బాంద్రాలోని ప్రఖ్యాత ‘గెలాక్సీ అపార్ట్‌మెంట్స్’ని  ఖాళీ చేయడానికి సిద్ధమవుతున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి వరుసగా వస్తున్న ప్రాణాపాయ బెదిరింపులు,  2024 ఏప్రిల్ 14న  ఇంటి వెలుపల జరిగిన కాల్పుల ఘటనే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. 

ఆ రోజు ఇద్దరు బైక్ దుండగులు సల్మాన్ తల్లిదండ్రులు ఉండే ఫ్లాట్ పై అంతస్తుని  లక్ష్యంగా చేసుకుని 4 రౌండ్ల కాల్పులు జరపడం బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత సల్మాన్‌కు 'వై ప్లస్' కేటగిరీ రక్షణ కల్పించినప్పటికీ, బిష్ణోయ్ ముఠా నుండి ముప్పు  మాత్రం తగ్గలేదు. ఇటీవల 2025 మే నెలలో కూడా కేవలం రెండ్రోజుల వ్యవధిలోనే ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ లోపలికి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కడం భద్రతా లోపాలని  మళ్ళీ ఎత్తిచూపింది.


Also read: Slumdog: రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దగ్గరకి పూరి స్లమ్‌డాగ్

ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు మరింత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఒక కొత్త నివాసంలోకి మారాలని నిశ్చయించుకున్నారు. గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ ఉన్న ప్రధాన రహదారికి కాకుండా, కొద్ది వందల మీటర్ల దూరంలో ఉన్న బాంద్రాలోని ‘చింబై’ ప్రాంతంలో ఒక ప్రశాంతమైన సందులో ఈ సరికొత్త ఆశీర్వాదం రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టుకి  సంబంధించి జూన్ 16న మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (MCZMA) నుండి ఖాన్ కుటుంబానికి అధికారికంగా అన్ని రకాల అనుమతులు లభించాయి. సల్మాన్ ఖాన్ తల్లి సల్మా ఖాన్ పేరిట ఉన్న ఈ సొంత ప్లాట్‌లో గ్రౌండ్ + స్టిల్ట్ + 6 అంతస్తుల ఒక అద్భుతమైన లగ్జరీ నివాస భవనాన్ని సముద్రానికి అభిముఖంగా ఉండేలా నిర్మించనున్నారు. 
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com