Home

»

Latest News

Slumdog: రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దగ్గరకి పూరి స్లమ్‌డాగ్

Jun 27, 2026 3:58PM

 

స్టార్ హీరో కి ఎంత మంది అభిమానులు ఉంటారో దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాలకి కూడా అంతే అభిమానులు ఉంటారు. ఆ విషయంలో అంతకు మించి అని చెప్పుకోవచ్చు. అంతలా సూపర్ డూపర్ హిట్స్ ని అందుకున్నాడు. ఇండస్ట్రీ హిట్స్ ని కూడా అందుకున్న పూరి నుంచి గత కొన్నేళ్లుగా సరైన చిత్రం రాలేదు. దీంతో ఆయన కమ్‌బ్యాక్ కోసం అభిమానులతో పాటు యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో పూరీ జగన్నాథ్ నయా ప్రాజెక్ట్ 'స్లమ్‌డాగ్' గురించి ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఒక క్రేజీ అప్‌డేట్ అందరిలో సరికొత్త జోష్ నింపుతోంది.

ఫిల్మ్‌నగర్ టాక్ ప్రకారం.. పూరీ జగన్నాథ్ తన అప్‌కమింగ్ మూవీ 'స్లమ్‌డాగ్' స్క్రిప్ట్‌ని  లెజెండరీ రైటర్, రాజమౌళి తండ్రి  విజయేంద్ర ప్రసాద్ వద్దకు తీసుకెళ్లారట. గతంలో పూరీ వరుస పరాజయాలను చూసి తట్టుకోలేకపోయిన విజయేంద్ర ప్రసాద్, సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ముందే స్క్రిప్ట్ తనకు ఒకసారి చూపించాల్సిందిగా పూరీకి ఆత్మీయ సలహా ఇచ్చారట. సాధారణంగా పూరీ కథ చెప్పే విధానం, ఆయన విలక్షణమైన మేకింగ్ స్టైల్ అంటే విజయేంద్ర ప్రసాద్‌కు ఎంతో ఇష్టం. ఆ ప్రత్యేకమైన అభిమానం మరియు నమ్మకంతోనే పూరీ రాసుకున్న 'స్లమ్‌డాగ్' స్క్రిప్ట్‌ను ఆయన లైన్ బై లైన్ ఎంతో నిశితంగా పరిశీలించినట్లు సమాచారం.

Also read: Dil Raju: ఇక మీ ఆటలు సాగవు బాసు.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

ఈ కథా చర్చల్లో భాగంగా విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ లోని లోపాలను సవరిస్తూ, కథ మరింత రసవత్తరంగా మారేలా కొన్ని కీలకమైన మార్పులని  పూరికి సూచించినట్లు తెలుస్తోంది. ఒక ఇంటెన్స్ మాస్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ 'స్లమ్‌డాగ్' చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ మార్కు ఎమోషనల్ టచ్, పకడ్బందీ స్క్రీన్‌ప్లే తోడైతే సినిమా రేంజ్ మారుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆయన ఇచ్చిన అమూల్యమైన ఇన్‌పుట్స్‌తో పూరి జగన్నాథ్ తన స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దిన తర్వాత, కథ చాలా అద్భుతంగా వచ్చిందని ఇండస్ట్రీ టాక్.

ఈ విధంగా మార్పులు చేసిన సరికొత్త వెర్షన్ విన్న తర్వాత విజయేంద్ర ప్రసాద్ కూడా పూరీని ఎంతగానో అభినందించారట. కథ నూటికి నూరు శాతం పర్‌ఫెక్ట్‌గా సెట్ అయిందని, ఈసారి బాక్సాఫీస్ వద్ద పూరి జగన్నాథ్ ష్యూర్ షాట్ హిట్ కొట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. స్లమ్‌డాగ్ రిలీజ్ కి దగ్గర పడుతున్న వేళ ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com