
సల్మాన్ ఖాన్ అనే పేరుకి ఉన్న చరిష్మా తెలిసిందే. మూడున్నర దశాబ్దాలపై నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. మరి అలాంటి సల్మాన్ ఖాన్ రామాయణ మూవీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తే ఆ మాటలు ఏ స్థాయిలో ప్రభావితం చూపిస్తాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదునకుంటా!.. మరి ఆ మాటలేంటో చూద్దాం.
ముంబైలో జరిగిన తన కొత్త చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ మాట్లాడుతు 'రామాయణం గురించి మాట్లాడేటప్పుడు బడ్జెట్ గణాంకాలని పక్కన పెట్టాలి. మూవీ గురించి మాట్లాడితే శ్రీరాముడు, సీతాదేవి, రావణాసురుడు వంటి అద్భుతమైన క్యారక్టర్ ల గొప్పతనం గురించి, మన ఇతిహాసాల గురించి చర్చ జరగాలి కానీ కేవలం రూ. 4,000 కోట్ల బడ్జెట్ మరియు వీఎఫ్ఎక్స్ (VFX) గురించే పదే పదే మాట్లాడటం సరికాదు.
కేవలం గ్రాఫిక్స్, నిర్మాణాత్మక ఖర్చుల చుట్టూనే నేరేటివ్ తిరగడం వల్ల సినిమా అసలు ఆత్మ దెబ్బతింటుంది. ఇటువంటి పౌరాణిక దృశ్య కావ్యాలను తెరకెక్కించేటప్పుడు సంస్కృతి, ఇతిహాసాలలోని నైతిక విలువలకు పెద్దపీఠ వేయాలని సల్మాన్ ఖాన్ అభిలషించారు.

సల్మాన్ ఖాన్ మాటలపై అభిమానులు, ప్రేక్షకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు రామాయణ బాక్స్ ఆఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుతూ ఉంది. ఐదున విడుదలైన రామాయణ రెండు రోజులకి 221 .05 కోట్ల గ్రాస్ వసులు చేసి సత్తా చాటుతూ ఉంది.
ఇది కూడా చదవండి: 'దాదా' ఫస్ట్ సాంగ్ డేట్ ఫిక్స్: ఫ్యాన్స్కి మాస్ ట్రీట్ రెడీ!
రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, రావణాసురుడిగా యష్ తో పాటు మిగతా నటీనటులు పండించిన పెర్ఫార్మ్ కి మంచి పేరు వస్తుంది. రివ్యూస్ కూడా పాజిటివ్ గా వస్తుండటంతో రాబోయే రోజులో సరికొత్త రికార్డ్స్ నెలకొలుపుతుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

మీకు నచ్చవచ్చు: ఫస్ట్ డే రామాయణ రికార్డు కలెక్షన్స్!
మీకు నచ్చవచ్చు: టబు పెళ్లి చేసుకోకపోవడానికి ఈ హీరోనే కారణం!
[Salman Khan About Ramayana Movie, Salman Khan, Ramayana movie, Ranbir Kapoor, Rs 4000 crore budget, Salman Khan comments on Ramayana, Tollywood News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]




