Home

»

Bollywood News

‘టిప్ టిప్ బర్సా పానీ..’ పాట షూటింగ్‌లో నరకం చూశానంటున్న రవీనా టాండ‌న్‌.. అసలేం జరిగింది?

Nov 9, 2026 10:44AM

బాలీవుడ్‌లో ఎన్నో వర్షపు పాటలు వచ్చాయి. కానీ ‘టిప్ టిప్ బర్సా పానీ’ పాటకు ఉన్న క్రేజ్ మాత్రం ప్రత్యేకం. అక్షయ్ కుమార్, రవీనా టండన్ జంటగా నటించిన ఈ పాట ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. తెరపై ఎంతో అందంగా, రొమాంటిక్‌గా కనిపించే ఈ పాట చిత్రీకరణ సమయంలో మాత్రం తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని సీనియర్ నటి రవీనా టండన్ తాజాగా వెల్లడించింది.

మాధురీ దీక్షిత్‌తో కలిసి ‘కోన్ హోనార్ కరోడ్‌పతి’ క్విజ్ షోలో పాల్గొన్న సందర్భంగా రవీనా ఈ విషయాలను గుర్తుచేసుకుంది. 1994లో విడుదలైన ‘మొహ్రా’ సినిమాలోని ఈ పాట షూటింగ్ మూడు రోజుల పాటు జరిగిందని తెలిపింది. ఆ మూడు రోజులూ ప్రతిరోజూ దాదాపు 12 గంటల పాటు కృత్రిమ వర్షంలో తడుస్తూనే షూటింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పింది.

అప్పట్లో వర్షం కోసం ఉపయోగించే నీటిని ట్యాంకర్లలో రోజుల తరబడి నిల్వ ఉంచేవారని రవీనా వివరించింది. అలా నిల్వ చేసిన నీరు షూటింగ్ సమయానికి విపరీతంగా చల్లగా మారేదని, ఆ నీటిలో తడుస్తూ డ్యాన్స్ చేయడం చాలా కష్టంగా ఉండేదని తెలిపింది. తెరపై పాటలో కనిపించే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో కష్టాలు ఉంటాయని ఆమె చెప్పుకొచ్చింది.

రవీనా మాటలతో మాధురీ దీక్షిత్ కూడా ఏకీభవించింది. అప్పట్లో వర్షం పాటల షూటింగ్ సమయంలో నటీనటులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఆమె గుర్తుచేసుకుంది. షాట్ పూర్తయ్యాక తడిసిన దుస్తులతోనే టవల్ కప్పుకుని కూర్చుని వణికిపోయేవాళ్లమని, కాస్త వెచ్చదనం పొందుతున్న సమయంలోనే మళ్లీ షూటింగ్‌కు పిలిచేవారని తెలిపింది. తిరిగి అదే చల్లటి నీటిలోకి వెళ్లి నటించాల్సి వచ్చేదని వివరించింది.

ఇది కూడా చదవండి: సినిమాల్లో ఎంట్రీకి శ్రీదేవి పెట్టిన కండిషన్ ఇదే.. తల్లి గురించి జాన్వీ కామెంట్స్!

ఇక అప్పట్లో తన పని ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉండేదని రవీనా వెల్లడించింది. ఒక ఏడాదిలో దాదాపు 30 సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయని, ఒక సెట్‌లో షూటింగ్ పూర్తికాగానే మరో సెట్‌కు వెళ్లి పనిచేసేవాళ్లమని గుర్తుచేసుకుంది. 

ఇలా విశ్రాంతి లేకుండా వరుసగా షూటింగులు చేసిన రోజులు కూడా ఉన్నాయని చెప్పింది. ఇన్ని కష్టాలు ఎదురైనా ‘టిప్ టిప్ బర్సా పానీ’ పాట మాత్రం తన కెరీర్‌లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించిందని రవీనా పేర్కొంది.

మీకు నచ్చవచ్చు: ఆదిపురుష్ రికార్డు అవుట్: బాక్స్ ఆఫీస్‌ని రఫ్ఫాడిస్తున్న రామాయణ

 

 

[Raveena Tandon, Tip Tip Barsa Pani, Raveena Tandon Latest News, Akshay Kumar, Mohra Movie, Tip Tip Barsa Pani Shooting, Madhuri Dixit, Bollywood News, Raveena Tandon Interview]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com